రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్. భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో పలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. మరికొన్ని రైళ్లు దారి మళ్లింపు చేపట్టినట్లు వివరించారు. ప్రయాణికులు గమనించాలని సూచించారు. అలాగే, దీపావళి పండుగకు పలు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. 


ఈ రైళ్లు రద్దు



  • గుంటూరు - విశాఖపట్నం (17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ నవంబర్‌ 6 నుంచి 12వ తేదీ వరకు రద్దు చేసినట్లు చెప్పారు.

  • రాజమండ్రి - విశాఖపట్నం మెము స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07466), విశాఖ - రాజమహేంద్రవరం (07467) రైలు నవంబర్ 6 నుంచి నవంబర్ 12 వరకు రద్దు చేశారు.

  • విశాఖపట్నం - గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17240)ను నవంబర్‌ 7 నుంచి 13వ తేదీ వరకు రద్దు చేసినట్లు ప్రకటించారు.


దీపావళికి ప్రత్యేక రైళ్లు


ఇదే సమయంలో ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్ అందించింది. దీపావళి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.



  • ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ - భువనేశ్వర్‌ (06073) ప్రత్యేక రైలు నవంబర్‌ 13, 20, 27 తేదీల్లో నడపనున్నారు. ఈ రైలు రాత్రి 11.45 గంటలకు చెన్నైలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. ఆ తర్వాత 11.20 గంటలకు బయలుదేరి వెళ్తుందని తెలిపారు. సాయంత్రం 6:30కు భువనేశ్వర్ చేరుకుంటుందని చెప్పారు.

  • భువనేశ్వర్‌ - చెన్నై సెంట్రల్‌ (06074) ప్రత్యేక రైలు నవంబర్ 14, 21, 28 తేదీల్లో రాత్రి 9 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. ఇక్కడి నుంచి తిరిగి 3.50 గంటలకు బయలుదేరి వెళ్తుందని అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటలకు చెన్నై చేరుకుంటుందని చెప్పారు. చెన్నై - భవనేశ్వర్ రైళ్లు రాష్ట్రంలోని గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్ధా రోడ్డు రైల్వే స్టేషన్లలో ఆగుతాయని అధికారులు పేర్కొన్నారు. 

  • చెన్నై సెంట్రల్ - సంత్రాగచ్చి మధ్య కూడా ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. నవంబర్ 11, 18, 25 తేదీల్లో చెన్నై సెంట్రల్ నుంచి  సంత్రాగచ్చి వరకూ స్పెషల్ సూపర్ ఫాస్ట్ (నెంబర్ 06071) ఏర్పాటు చేశారు. ఈ రైలు చెన్నై సెంట్రల్ లో రాత్రి 11.45కి బయల్దేరి మూడో రోజు తెల్లవారు జామున 3:45 గంటలకి సంత్రాగచ్చికి చేరుకుంటుంది.

  • ఈ నెల 13, 20, 27 తేదీల్లో సంత్రాగచ్చి నుంచి చెన్నై సెంట్రల్‌‌కి ప్రత్యేక సూపర్‌ ఫాస్ట్‌ రైలు (నెంబర్ 06072) నడపనున్నారు. ఈ రైలు సంత్రాగచ్చిలో తెల్లవారు జామున 5 గంటలకి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుంది. ఈ రైళ్లు గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్దా రోడ్డు రైల్వేస్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు.


సూరత్ - బ్రహ్మపుత్ర మధ్య



  • నవంబర్ 8, 15, 22, 29 తేదీల్లో సూరత్ - బ్రహ్మపుర మధ్య ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే ఈ ట్రైన్‌ డిసెంబరు 6, 13, 20, 27 తేదీల్లో మధ్యాహ్నం 2:20 గంటలకు సూరత్‌లో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.10 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 8.58 గంటలకు పెందుర్తికి చేరుకుంటుంది.

  • బ్రహ్మపుర - సూరత్‌ (09070) ప్రత్యేక రైలు నవంబర్‌ 10, 17, 24 తేదీల్లో అందుబాటులో ఉండనుంది. అలాగే డిసెంబరు 1, 8, 15, 22, 29 తేదీల్లో తెల్లవారుజామున ఉదయం 3:30 గంటలకు బ్రహ్మపురలో బయలుదేరి ఉదయం 7:10 గంటలకు పెందుర్తికి, ఆ తర్వాత 8.20 గంటలకు దువ్వాడకు చేరుకుంటుందని అధికారులు వివరించారు. ఈ మేరకు ప్రయాణికులు ప్రత్యేక రైళ్ల సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు.


Also Read: ఏపీలో మళ్లీ కొత్త జిల్లాల చర్చ - నిప్పు లేనిదే పొగ వస్తుందా ?