Sharmila wrote a letter to Chandrababu : రైతుల కష్టాలను రాష్ట్ర ఎమర్జెన్సీగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని లేఖలో గుర్తు చేశారు. ల  ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిని ఆదుకోవాలని కోరారు ముఖ్యంగా, కోస్తా జిల్లాల్లో వర్షాలు, వరదలతో రైతులు తీవ్రంగా నష్పోయారని..  కాలం చెల్లిన, అస్తవ్యస్తంగా మారిన కాలువల నిర్వహణ కారణంగా పంట పొలాలు నీట మునిగాయన్నారు. ఈ కారణంగా  తీవ్ర స్థాయిలో పంట నష్టం జరిగిందని షర్మిల లేఖలో తెలిపారు.  





 


వరద ప్రభావిత ప్రాంతాల్లోని రైతుల దుస్థితి పట్ల మంత్రులు ,  ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ ఒక్కరు కూడా మాట్లాడకపోవడం నిరాశ కలిగించిందన్నారు.  మీ ప్రభుత్వం గుప్పించిన హామీలు, వాగ్దానాలకు... మీరు వ్యవహరిస్తున్న తీరు విరుద్ధంగా ఉందన్నారు. రైతుల కష్టాలను రాష్ట్ర ఎమర్జెన్సీగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని గట్టిగా కోరుతున్నానన్నారు.  రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి, తగిన నష్టపరిహారం చెల్లించేందుకు వీలుగా వెంటనే పలు బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి పరిశీలనకు పంపాలని కోరారు.        


రాజకీయ కేసులపై ప్రత్యేక కమిషన్ - తప్పుడు కేసులు పెట్టిన వారికి శిక్షలు - చంద్రబాబు ఆలోచన


కాలువల నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే పంట పొలాల మునకకు దారితీసిందని తన పర్యటనలో తెలిసిందన్నారు.  గత ప్రభుత్వం కాలువల నిర్వహణను విస్మరించింది. కాలువల మరమ్మతులకు ఉద్దేశించిన నిధులను గత ప్రభుత్వం దారిమళ్లించింది. వెంటనే కాలువల మరమ్మతులకు నిధులు కేటాయించాలని మీ ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.  గత ప్రభుత్వం రైతులకు ధాన్యం సేకరణ బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేసింది. ఇప్పుడు వర్షాలు, వరదలతో సతమతమవుతున్న ఆ రైతులకు బకాయిలు కూడా చెల్లించాలని   షర్మిల తన లేఖలో  కోరారు.                           


రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు చేయకుండానే వెనక్కి జగన్ - అపాయింట్‌మెంట్లు దొరకలేదా ?                                               


బుధవారం పంట పొలాల పరిశీలనకు వెళ్లిన షర్మిల నడుంలోతు నీళ్లలో దిగి.. మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించారు. రైతులకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తన పర్యటనలో వెల్లడైన విషయాలను వివరిస్తూ.. రైతులకు సాయం కోసం లేఖ రాశారు.