Sajjala : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లడాన్ని ఎలా చూడాలని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. జగన్ ఢిల్లీ వెళితే తాటాకులు కడతారని… మరిప్పుడు చంద్రబాబు గురించి ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. బీజేపీతో కలవటానికి చంద్రబాబు వెంపర్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ తాజా రాజకయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్ వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. చంద్రబాబు మాటలు పగటి కలల్లా ఉంటాయన్నారు. టీడీపీ మేనిఫెస్టోను జగన్ పొగిడారని చంద్రబాబు చెబుతున్నరాని.. అలా ఎలా అనుకుంటారని ఆయన ప్రశ్నించారు.
టీడీపీ మేనిఫెస్టోను జగన్ పొగడలేదని సజ్జల వివరణ
చంద్రబాబు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడే.. కానీ ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు మేనిఫెస్టో విషయంలో జగన్ పొగిడారు అని తనకు తానే అనుకోవడం విచిత్రంగా ఉందన్నారు. జూన్ 2 సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబునాయుడు టీడీపీ మేనిఫెస్టోను జగన్ పొగిడారన్నారు. సీఎం జగన్ రైతు భరోసా నిధులను విడుదల చేసినప్పుడు కర్ణాటక, తెలుగు ప్రజలకు ఇష్టమన వంటకాలతో పోల్చారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో ప్రజలను ఆకట్టుకున్న హామీలు ఉన్నాయన్నారు. మేనిఫెస్టోను ఎద్దేవా చేయాలనుకున్న పొగిడారని ఇప్పుడా స్క్రిప్ట్ రైటర్ ను ఏం చేస్తారోనని చంద్రబాబు ఎద్దేవా చేశారు. దీనిపైనే సజ్జల స్పందించారు. జగన్ మేనిఫెస్టోను పొగడ లేదన్నారు.
లోకేష్ ప్లకార్డుల ప్రదర్శన వ్యవహారం చిల్లరగా ఉందన్న సజ్జల
కడప జిల్లాలో పాదయాత్రలో ఉన్న లోకేష్ చేస్తున్న విమర్శలపైనా సజ్జల రామకృష్ణారెడ్డి స్పదించారు. చవకబారుగా వివేకా అంశంపై ప్లకార్డులు ప్రదర్శిస్తున్నాడని మండిపడ్డారు. లోకేష్ చిల్లరగా వ్యవహరి్సతున్నరాని.. కింది స్థాయి కార్యకర్తలు చేస్తే అర్థం చేసుకోవచ్చని..కానీ లోకేష్ అలా చేయడమేమిటన్నారు. గర్భంలో ఉన్నప్పుడే మానసిక వైకల్యం వచ్చి ఉంటుందని మండిపడ్డారు.
పవన్ కల్యాణ్ గెస్ట్ ఆర్టిస్టుగా అభివర్ణించిన సజ్జల
పవన్ కళ్యాణ్‌ను తిరగవద్దని ఎవరూ అనలేదని.. ప్రజల్లో తిరగమనే చెబుతున్నామన్నారు. ఇప్పుడు కూడా ఎంత వరకు తిరుగుతాడో నమ్మకం లేదన్నారు. తన కొడుకుకు అడ్డం వస్తాడని చంద్రబాబు ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ యాత్రను ఆపినట్లు ఉన్నాడని ఆయన ఆరోపణలు చేశారు. ఒక కులాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి రావాలనుకుంటే ప్రజలు అంగీకరించరని.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ గెస్ట్ ఆర్టిస్టులేనని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.