Sajjala On Chandra babu :   అమరావతిలోనే రాజధాని ఎందుకు ఉండాలో చంద్రబాబు చెప్పాలని ప్రభుత్వ ముఖ్యసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. కర్నూలులో చంద్రబాబు పర్యటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం  వికేంద్రీకరణ  అంశాన్ని   ఆషామాషీగా  తీసుకోలేదనితెలిపారు. శాస్త్రీయ విధానంతోనే రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.ఆదాయం అంతా ఒకేచోట కేంద్రీకృతం కావద్దనేది మా అభిమతం అని తెలిపారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్నారు. వికేంద్రీకరణపై మాకు స్పష్టత ఉంది. వికేంద్రీకరణ ఎందుకు అవసరమో మేం స్పష్టంగా చెబుతున్నాం. అమరావతిలోనే రాజధాని ఎందుకుండాలో చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు.


వైఎస్ కూడా వికేంద్రీకరణపై దృష్టి పెట్టారని తెలిపిన సజ్జల 


వైఎస్  రాజశేఖరరెడ్డి  వికేంద్రీకరణ  పై  గతంలో దృష్టి  పెట్టారన్నారు. వికేంద్రీకరణపై చంద్రబాబు ఎప్పుడూ ఫోకస్ పెట్టలేదని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.  న్యాయ రాజధానిపై మీ వైఖరేంటని అడిగితే బాబు సమాధానం చెప్పలేదని.. పైగా ఎదురు దాడి చేశారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అడిగితే సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా అని రామకృష్ణారెడ్డి  చంద్రబాబును ప్రశ్నించారు. అమరావతి  లో  రైతుల  సమస్యల  కు  పరిష్కారం  దొరికితే  చంద్రబాబు  వికేంద్రీకరణ  కు   అంగీకరిస్తారా   అని ప్రశ్నించారు. విజయవాడ  గుంటూరు  కాకుండా   రాజధాని  పెట్టాడురని.. రైతుల  నుంచి  భూములను  లాక్కుని  చంద్రబాబు  వ్యాపారం  చేయాలనుకున్నారని ఆరోపించారు.


చంద్రబాబును రాష్ట్రం ఎందుకు మోయాలని ప్రశ్నించిన సజ్జల 


ప్రజల ప్రశ్నలను డైవర్ట్ చేయడానికే బాబు తిట్ల పురాణం మొదలుపట్టారని ఆయన ఆరోపించారు.  అధికారం తనకు హక్కు అయినట్టు మాట్లాడుతున్నారని.. రౌడీలకు రౌడీనని ఎలా అంటారని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకు ఆ బరి తెగింపు ఎందుకని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాష్ట్రం  చంద్రబాబు  ను  మొయ్యాలా... ఎక్కడిది  ఈ  లెక్కలేనితనమనన్నారు. టీడీపీ చేపట్టిన కార్యక్రమం  ఇదేం  ఖర్మ  కాదు  ఇదేమి  కడుపుమంట  అన్నట్టు  గా  ఉందన్నారు. కర్నూలులో చంద్రబాబు విన్యాసాలను ప్రజలు చూశారని ... 40 ఏళ్ల ఇండస్ట్రీకి అంత కోపం ఎందుకు వచ్చిందని సజ్జల ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌లా బాబుకు కూడా చెప్పు చూపించాలనే కోరిక వున్నట్లుందని రామకృష్ణారెడ్డి ఆరోపించారు.   


టీడీపీ అంటే తిట్లు, దూషణలు, బూతులు పార్టీ అని రుజువైందన్న సజ్జల 


చంద్రబాబు మాటలతో టీడీపీ అంటే తిట్లు, దూషణలు, బూతులు పార్టీ అని మరోసారి రుజువైందన్నారు. అన్ని చిట్‌ఫండ్స్‌ మాదిరిగానే మార్గదర్శిలో తనిఖీలు చేస్తే కక్ష సాధింపు అని గగ్గోలుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపాజిట్లు తీసుకుని డైవర్ట్‌ చేసినట్లు ఫిర్యాదులు వస్తే తనిఖీలు చేయొద్దా?. మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా?' అని ప్రశ్నించారు.  కర్నూాలులో చంద్రబాబు తీరును సజ్జల పదే పదే తప్పు పట్టారు. 


రక్తంతో పెయింటింగ్ వేసిన ఫ్యాన్ - మంత్రి రజనీ రియాక్షన్ ఏమిటో తెలుసా ?