కోడిపెట్ట గడ్డు పెట్టడం సహాజం...ఇది సృష్టి ధర్మం. కానీ ఇక్కడో వింత చోటుచేసుకుంది. కోడిపుంజు గుడ్లు పెట్టింది. అంతే కాదండోయ్ వాటిని పొదిగి పిల్లలు కూడా చేసింది. చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలంలోని పెద్దకన్నలి ఎస్టీ కాలనీలో సుబ్రమణ్యంరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో 4 కోడిపెట్టలు, ఒక పుంజు ఉంది. ఈ కోడి పుంజు 5 గుడ్లు పెట్టింది. ఈ వింత సంఘటన చూసి యజమాని ఆశ్చర్యానికి గురయ్యాడు. అయితే ఏం జరుగుతుందో అని చూడాలనుకున్నాడు. ఆ గుడ్లు పుంజు పొదిగేలా.. తీసుకెళ్లి పుంజు కిందపెట్టాడు. ఆ పుంజు ఆ గుడ్లు పొదిగి 5 పిల్లలను చేసింది. ప్రస్తుతం ఆ పుంజు పిల్లలను కంటికి రెప్పలా రక్షిస్తోంది. ఈ విషయం ఆనోటా ఈనోటా ప్రచారమవ్వడంతో ఆ కోడిపుంజును, పిల్లలను చూసేందుకు గ్రామస్తులు తరలి వెళ్తున్నారు. పుంజు గుడ్లు పెట్టడంపై వెటర్నరీ అధికారి వీరభద్రరెడ్డి వివరణ ఇచ్చారు. జన్యుపరమైన కారణాలతో ఇలాంటి అరుదైనా ఘటనలు జరుగుతాయని స్పష్టం చేశారు.
కోడి ముందా..? గుడ్డు ముందా..? అంటే సమాధానం చెప్పడం కష్టమే. అప్పుడు మరో వింత సంఘటన జరిగింది. కోడి గుడ్డు అంటే కోడి పెట్ట గుడ్డుగా మనకు తెలుసు...ఇప్పుడు కోడి పుంజులు కూడా గుడ్లు పెడుతున్నాయని ఈ వింత సంఘటనతో అర్ధం అవుతోంది. మీరు విన్నది నిజమే కోడిపుంజు గుడ్డు పెట్టింది. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించి..తొట్టంబేడు మండలంలోని పెద్దకన్నలి ఎస్టీ కాలనీకి సుబ్రహ్మణ్యం రెడ్డి ఇంట్లో ఉన్న కోడిపుంజు గుడ్లు పెట్టింది. వాటిని పొదిగి పిల్లల్ని కూడా చేసింది. ఈ గుడ్లను చూసి యజమాని వీటిని వేరే కోడి పెట్టిందని అనుకున్నాడు. కానీ తర్వాత కోడిపుంజు గుడ్డు పెట్టిందని నిర్ధారించుకున్నారు. ఆ కోడిపుంజు 5 రోజులు అయిదు గుడ్లు పెట్టింది. ఆ గుడ్లను జాగ్రత్తగా ఉంచిన ఆయన.. ఆ గుడ్లను కోడిపుంజుతోనే పొదిగించాడు. అలా కోడిపుంజు పెట్టిన గుడ్ల నుంచి 5 కోడిపిల్లలు వచ్చాయి. ఈ ఘటనను వెటర్నరీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా... వారు ఇది జన్యుపరమైన కారణాల వల్లే జరిగిందని తేల్చేశారు. ఆ పిల్లలను పుంజు కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.
Also Read: Venkateshwar Rao Suspended: రేవ్ పార్టీలో చిందులు... సీఐపై వేటుS