Nara Lokesh, Yuvagalam Padayatra: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజమండ్రి చేరుకున్నారు. టిడిపి నేతలు, కార్యకర్తలు విమానాశ్రయం వద్ద పెద్ద ఎత్తున లోకేష్ కి స్వాగతం పలికారు. రాజమండ్రి నుంచి పొదలాడ యువగళం క్యాంప్ సైట్ కి వెళ్లారు నారా లోకేష్ (Nara Lokesh). డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి (BR Ambedkar Konaseema) నారా లోకేష్ యువగళం పాదయాత్ర పున: ప్రారంభం అవుతోంది. రాజోలు మండలం పొడలాడ గ్రామంలో 78 రోజులు కిందట చంద్రబాబు అరెస్ట్ కారణంగా నిలిచిన యువగళం పాదయాత్ర అక్కడి నుంచే ప్రారంభం చేయనున్నారు. 210వరోజు నవంబర్ 27న ఉదయం రాజోలు నియోజకవర్గం పొదలాడ శుభం గ్రాండ్ వద్ద నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. యువగళంలో భాగంగా లోకేష్ ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2852.4 కి.మీ.
పాదయాత్ర కోసం ఇప్పటికే టిడిపి శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. పొదలాడ నుంచే నారా లోకేష్ యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం తాటిపాక బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పి.గన్నవరంలో గెయిల్, ఓఎన్‌జీసీ బాధితులతో ముఖాముఖి.. మామిడికుదురులో స్థానికులతో లోకేష్ భేటీ అవుతారు. సోమవారం దాదాపు 16 కిలోమీటర్ల మేర లోకేశ్ పాదయాత్ర సాగనుంది. లోకేష్ పాదయాత్ర ఈ ఏడాది జనవరి 27న కుప్పంలో మొదలైంది. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు 400 రోజుల్లో 4000 కి.మీ.ల పాదయాత్ర లోకేష్ అనుకున్న లక్ష్యం. సెప్టెంబరు 9న సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేయడంతో లోకేశ్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు.
రాష్ట్రంలో 5కోట్లమంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 79రోజుల విరామానంతరం ప్రారంభం చేయనున్నారు. చంద్రబాబునాయుడుపై కేసులు బనాయించి జైలుకు పంపడంతో అనివార్య పరిస్థితుల్లో సెప్టెంబర్ 9వ తేదీన కోనసీమలోని రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద యువనేత లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. తర్వాత దేశరాజధాని డిల్లీలో న్యాయపోరాటం చేస్తూనే లోకేష్ జాతీయస్థాయి నేతల మద్దతు కూడగడుతూ జాతీయ మీడియాలో తమ గళాన్ని విన్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రాష్ట్రంలో తీరును ఆమె దృష్టికి తెచ్చారు. తాజా పరిణామాలను పార్టీ పెద్దలతో చర్చించిన లోకేష్... అన్ని అడ్డంకులను అధిగమించి ఈనెల 27వతేదీ నుంచి గతంలో పాదయాత్ర నిలుపుదల చేసిన పొదలాడ నుంచి యువగళాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ కొనసాగనున్న యువగళం తుని మీదుగా ఉమ్మడి విశాఖ జిల్లాలోకి ప్రవేశించనుంది.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు
రాజోలు/పి.గన్నవరం/అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు (ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా)
ఉదయం
10.19 – రాజోలు నియోజకవర్గం పొదలాడ శుభం గ్రాండ్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.
11.20 – తాటిపాక సెంటర్ లో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.
12.35 – పి.గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశం, నగరంలో గెయిల్, ఓఎన్జిసి బాధితులతో లోకేష్ ముఖాముఖి.
2.00 – మామిడికుదురులో స్థానికులతో సమావేశం.
2.45 – పాశర్లపూడిలో భోజన విరామం.
సాయంత్రం
4.00 – పాశర్లపూడి నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.30 – అప్పనపల్లి సెంటర్ లో స్థానికులతో సమావేశం.
5.30 – అమలాపురం నియోజకవర్గంలో ప్రవేశం, స్థానికులతో మాటామంతీ.
6.30 – బోడసకుర్రులో మత్స్యకారులతో ముఖాముఖి.
7.30 – పేరూరులో రజక సామాజికవర్గీయులతో భేటీ.
7.45 – పేరూరు శివారు విడిది కేంద్రంలో లోకేష్ బస చేయనున్నారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply