ఖలేజా సినిమాలో మహేష్ కోసం త్రివిక్రమ్ రాసిన మాటలు సూపర్ స్టార్ విషయంలో అక్షరసత్యం. ఓ నటుడిగా ఆయన సంపాదించిన క్రేజ్ కంటే, ఓ సూపర్ స్టార్ గా ఆయనకున్న స్టార్ డమ్ కంటే ఓ మనిషిగా మహేష్ వందమెట్లు ఎక్కించిన కథలెన్నో. తన కుమారుడికి చిన్నప్పుడు వచ్చిన కష్టం ఏ పిల్లాడికి రాకూడదని మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఆ చిన్నారుల కన్నీటి కథలు ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఓ కథే ఇది. 


తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది చిన్నారు తమ పుట్టిన రోజుగా ఆగస్టు 9నే చేసుకుంటారు. వారి పుట్టింది వేర్వేరు నెలల్లో అయినా వారి పుట్టిన రోజు మాత్రం మహేష్‌ బాబు పుట్టిన రోజునే చేసుకుంటారు. వాళ్లే కాదు ఆ చిన్నారుల ఫ్యామిలీ మెంబర్స్‌ మొత్తం మహేష్ అంటే ప్రాణం. సినిమాలు చూసి మహేష్‌ను ఆరాధించే డైహార్డ్ ఫ్యాన్స్ కంటే ఎక్కువ ఇష్టపడతారు. వీళ్లంతా సినిమాలు చూసి అభిమానులుగా మారలేదు. వారి కష్టాన్ని గట్టెక్కించిన ఇంట్లో దీపాన్ని  ఆరిపోకుండా కాపాడిన మహేష్‌కు నిజంగా గుండెళ్లో గుడి కట్టేశారు. 


అలాంటి కుటుంబాల్లో వేదాన్ష్ ఫ్యామిలీ కూడా ఉంది. నిజంగా వేదాన్ష్‌ పుట్టిన రోజులు ఆగస్టు9 కాదు కానీ ఆ రోజు వారి ఇంట్లో పెద్ద పండగే జరుగుతుంది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్‌ మండలం చిందాడ గరువుకు చెందిన దాసరి దొరబాబు, అరుణ దంపతులకు వేదాన్ష్ పుట్టిన ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. హార్ట్ లో హోల్ ఉందని తెలియటంతో వాళ్లు తిరగని ఆసుపత్రి లేదు. పిల్లాడిని బతికించుకోవటానికి చేయని ప్రయత్నం లేదు. 


వేదాన్ష్‌కు ఆపరేషన్ చేయించాలంటే ఐదులక్షలు కావాలని డాక్టర్లు చెప్పగా.. ఏం చేయాలని పాలుపోని స్థితిలో మహేష్ బాబు ఫౌండేషన్ వారికి వెలుగు రేఖగా నిలిచింది. జీవితాల్లో వెలుగు నింపింది. అమలాపురం టౌన్ మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడు కొప్పిశెట్టి నర్సింహమూర్తి మహేష్ బాబు ఫౌండేషన్ దృష్టికి తీసుకువెళ్లటంతో ఈ బాబును విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ లో చేర్పించారు.


పైసా ఖర్చు లేకుండా మొత్తం మహేష్ బాబు భరించటంతో బాబుకు ఆపరేషన్ విజయవంతంగా పూర్తైంది. ఆపరేషన్ పూర్తే ఇప్పటికి ఏడాదైంది. బాబు చాలా ఆరోగ్యంగా ఉండటమే కాదు ఇదిగో హ్యాపీగా కేక్ కట్ చేసి పుట్టిన రోజు చేస్తున్నాడు. అందుకే బాబు పుట్టినరోజు ఎప్పుడైనా కానీ మహేష్ బాబు పై ప్రేమతో ఆయన పుట్టిన రోజునాడే బాబు పుట్టినరోజు చేస్తామని తల్లితండ్రులు ఇలా కేక్ కట్ చేయించారు..


కేవలం నటుడిగానే కాకుండా ఇలా సహాయక కార్యక్రమాలతోనూ ముందుంటున్న మహేష్.. 2022 నాటికే 1058 చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించి రియల్ లైఫ్ లోనూ సూపర్ స్టార్ నని నిరూపించారు మహేష్.