ఏపీలో విశాఖపట్నంలోనే షిప్‌ల తయారీ కేంద్రం ఉండగా పీడీఎస్ బియ్యం అక్రమ ఎగుమతుల గురించి ఏపీ డిప్యూటీ సీఎం సీజ్‌ద షిప్ అనేమాటతో ఈ మధ్య వార్తల్లో నిలిచిన కాకినాడ పోర్టు ఉండే కాకినాడ జిల్లాలో కూడా షిప్‌ల తయారీ కేంద్రం త్వరలోనే రాబోతోంది.. ఈ దిశగా అడుగులు వడివడిగా పడుతున్నట్లు తెలుస్తోంది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రకటించిన మారీటైం బోర్డు పాలసీలో నౌకల నిర్మాణానికి ఆమోదం తెలిపింది... ఈ క్రమంలోనే షిప్‌ల తయారీ కేంద్రానికి కాకినాడ అనుకూలంగా ఉంటుందని ప్రతిపాదిస్తూ కూటమి ప్రభుత్వం కేంద్రానికి నివేదిక కూడా పంపినట్లు తెలుస్తోంది..
సువిశాల సాగరతీరం.. సముద్రానికి ఆనుకుని వందల ఎకరాల ఖాళీ భూమి ఇలా షిప్‌ల తయారీకు కాకినాడ తీర ప్రాంతం అనూలంగా ఉండగా కాకినాడ జిల్లా కేంద్రంగా రూ.300 కోట్లుతో చిన్న, మద్యతరహా నౌకల నిర్మాణానికి షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు... ఏపీలో అసలు నౌకలకు మరమ్మత్తులు, వాటికి కావాల్సిన రోప్‌లు ఇలా అన్నీ కాకినాడ జిల్లా పరిధిలోకి వచ్చే కోరంగి వద్దే బ్రిటీష్ కాలంలో జరిగేవని చెబుతారు.. ఇప్పుడు మళ్లీ కాకినాడ తీరానికి ఆనుకుని రాబోయే షిప్‌ల తయారీ కేంద్రం వల్ల అనుబంధంగా ఉండే అనేక రంగాలకు కూడా మహర్ధశ రాబోతుందని కాకినాడ జిల్లా ప్రజలు చెబుతున్నారు..
ఊతమిచ్చిన మారీటైం పాలసీ..
కాకినాడ పోర్టుకు సంబందించి రాకపోకలు జరిపే నౌకలు, వాటిలోని సరుకుకు సంబందించి రక్షణ కల్పించే విధంగా ఏపీ మారీటైం పాలసీను తీసుకువస్తోంది.. దీనికి సంబందించి కార్యాలయం కాకినాడలో ఉండడం కూడా షిప్‌ల తయారీ క్లష్టర్లకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించడంతో కాకినాడ తీరం కేంద్రంగా నౌకలతయారీ కేంద్రానికి అనుకూలత లభించినట్లు అవుతోంది.. కాకినాడకు షిప్‌ల యతారీ కేంద్రం ఆమోదం లభిస్తే అన్నీ అనుకూలతలే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. తీరానికి ఆనుకుని వందల ఎకరాల భూములు ఉండడం పెద్ద ప్లస్ పాయింట్ కాగా దగ్గల్లోనే యాంకేజ్ పోర్టు, నౌకలు, బార్జీలు, టగ్‌లు తయారు చేసిన క్రమంలోÊ సమీపంలోనే ఉన్న సముద్ర జలాల్లోకి వాటిని దించి సామర్ధ్య పరీలు చేసేందుకు ప్రయోజనకరంగా ఉంటుంది..
కాకినాడలో శాన్ మెరైన్ ద్వారా చిన్న తరహా నౌకలు..
కాకినాడలో ఇప్పటికే శామ్ మెరైన్ అనే సంస్థ చిన్న, మద్య తరహా నౌకలు తాయరీ చేస్తోంది.. వీటితోపాటు బార్జీలు, టగ్‌లు నిర్మాణం చేస్తోంది.. ఇదే సంస్థ ఏడాది క్రితం ఎనిమిది వేల టన్నుల భారీ షిప్‌ను తయారు చేసింది..కూటమి ప్రభుత్వం తాజాగా మారీటైం పాలసీను ప్రకటించడం, నౌకల తయారీ క్లస్టర్లకు ప్రాధాన్యత కల్పిస్తామని ప్రకటించడంతో కంపెనీలు కాకినాడ రావడానికి దృష్టిసారించే పరిస్థితి ఏర్పడిరదంటున్నారు.. దేశవ్యాప్తంగా హిందుస్తాన్, కొచిచన్, గోవా, మజిగావ్ షిప్ యార్డుల ద్వారా 100 నుంచి 150 ఎకరాల విస్తీర్ణంలో నౌకల నిర్మాణాలు చేపడుతున్నాయి.. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో ఆజాబితాలోకి కాకినాడ కూడా చేరే అవకాశాలు దగ్గర్లోనే ఉన్నాయంటున్నారు.
Also Read: Kakinada Port Case: కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈడీ, సీఐడీ దూకుడు, వారికి మరోసారి నోటీసులు జారీ