చంద్రబాబు ఒక ఆల్‌ఫ్రీ బాబా..
టీడీపీ మ్యానిఫెస్టోపై రాజమండ్రి ఎంపీ భరత్‌ విమర్శలు


ఏపీ మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రాజమండ్రి వేదికగా ఒక మాయనాడు నిర్వహించారని, ఇదే ఆఖరినాడు కాబోతుందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ విమర్శించారు. యుగపురుషుడు అని కీర్తించే వ్యక్తి ఎన్టీఆర్ నే వెన్నుపోటు పొడిచారని, ఓ పక్క వెన్నుపోటు పొడిచి అదే చేత్తో దండ వేస్తారన్నరు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చంద్రబాబును ఆల్‌ఫ్రీ బాబా అని అనేకసార్లు అన్నారని గుర్తుచేశారు. రాజమండ్రిలో మీడియాతో ఎంపీ భరత్‌ మాట్లాడారు.. 
చంద్రబాబు గతంలో అనేక ఎన్నికల వాగ్ధానాలు చేశారని, 2009లో మొత్తం అన్నీ ఉచితంగా ఇస్తానని చెప్పుకొచ్చారని, ఇప్పుడు అదే రిపీట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ బృతి ఇస్తానని చెప్పి ఎంతమందికి ఇచ్చాడని ప్రశ్నించారు.. ఎన్నికలు కేవలం ఎన్నికలకు ఆరు నెలల ముందు నిరుద్యోగ బృతి ఇచ్చారని, మళ్లీ నిరుద్యోగ భృతి ఇస్తానని, ఇంటికి మూడు వేలు ఇస్తానని చెపుతున్నాడని ఇది ఎన్నికల స్టంట్ కాదా అని ప్రశ్నించారు. 


ఇంటికి రెండు ఉద్యోగాలు ఎవరికిస్తారు..
ఇంటికి రెండు ఉద్యోగాలు ఇస్తానని చెబుతున్న చంద్రబాబు సొంత కుమారుడు, దత్త పుత్రునికి కలిసి రెండు ఉద్యోగాలు ఇస్తాడా అని ప్రశ్నించారు. అసలు ఆ రెండు ఉద్యోగాలైనా ఇవ్వగలవో లేదో చూసుకోవాలన్నారు. రైతులకు రూ.20 వేలు భరోసా కింద ఇస్తానని చెబుతున్నాడని, మీ సామాజిక వర్గానికి చెందిన రైతులకు ఇస్తావా.. మహాశక్తి అని చెప్పి, అమ్మకు వందనం అని చెప్పి ప్రకటించి మళ్లీ అదే చెబుతున్నారని, అయితే ప్రజలు మీ వాగ్ధానాలను ప్రజలు విశ్వసించాలి కదా అన్నారు. ఆల్‌ఫ్రీ బాబు ను ప్రజలంతా చూశారని, ఎన్టీఆర్‌ను దుర్భాషలాడారో, ఆయన పేరుమీద ఉన్న పథకాలను తొలగించారని మార్గాని భరత్ అన్నారు.


మ్యానిఫెస్టో అంతా కాపీలమయం..
మహానాడు వేదికగా ప్రకటించిన మ్యానిఫెస్టో అంతా కాపీల మయంగా ఉందన్నారు. తెలంగాణ నుంచి రెండు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి రెండు, కర్నాటకలో కాంగ్రెస్‌, బీజేపీలు ఏవిధమైన హామీలు ఇచ్చారో అవన్నీ కాపీ చేశారన్నారు. దసరాకు ప్రకటించనున్న మ్యానిఫెస్టో తెలంగాణ ఎన్నికల మ్యానిఫెస్టో నుంచి కాపీ కొడతాడన్నారు. ఒడ్డు దాటేదాకా మాత్రమే చంద్రబాబు ఉంటారని సామెతను గుర్తుచేశారు. మాటలు చెపుతారు కానీ చేతల్లో ఉండవన్నారు. ఏదో రకంగా అధికార కుర్చీ ఎక్కాక ప్రజలకు ఏవిధంగా మొండి చేయి చూపిస్తారో గతంలో చూశామన్నారు. ఇది ప్రజలు గమనించాలని కోరారు. పెత్తందారులే చంద్రబాబును పైకి తీసుకొస్తారన్నారు.


బుచ్చయ్య నా శిష్యుడే అంటూ తిడుతున్నారు..
నా శిష్యుడే అంటూ నన్ను తిడుతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటున్నారని, కురువృద్ధుడు అయిన బుచ్చయ్య పోటీపడి మరీ తిడుతున్నారన్నారు. మహానాడు కోసం ఫ్లెక్సీలు వేసుకోవడం లేదని, మేము చేస్తున్న అభివృద్ధి గురించే ఫ్లెక్సీలు వేసుకుంటున్నామన్నారు. బుచ్చయ్యకు అన్నీ అర్ధమవుతున్నాయని, అయితే ఆపార్టీలో ఉండి తిట్టడమే చేయాలన్నారు. ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశిస్తున్న మరో నాయకునికి మహానాడులో కనీసం మైక్‌ కూడా ఇవ్వలేదని, ముందు మైక్‌ తెచ్చుకోవాలని, ఆతరువాత ఎమ్మెల్యే టిక్కెట్టు తెచ్చుకుందువు అంటూ ఎద్దేవా చేశారు. నాలుగు ఫ్లైవోవర్లు సేంక్షన్‌ అయినవి క్యాన్సిల్‌ చేసి ఒక ఫ్లై ఓవర్‌ సాధించానని బుచ్చయ్య చౌదరి చెబుతున్నాడని మండిపడ్డారు.