AP Graduates MLC Elections | రాజమండ్రి: ఏపీలో మూడో ఎమ్మెల్సీ స్థానం ఫలితం వచ్చేసింది. ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖరం గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, పిడిఎఫ్ అభ్యర్థి వీర రాఘవులుపై కూటమి మద్దతు తెలిపిన అభ్యర్థి రాజశేఖరం విజయం సాధించారు. ఏలూరు సి ఆర్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో సోమవారం మొదలైన ఈ ఓట్ల లెక్కింపు మంగళవారం ముగిసింది. గెలుపొందిన అనంతరం రాజశేఖరం మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు వచ్చేలా తన వంతు కృషి చేస్తానన్నారు. తనను అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
సోమవారం మూడో రౌండ్ పూర్తి అయ్యేసరికి పేరా భత్తుల రాజశేఖరానికి 48 వేల 923 ఓట్లు రాగా, పిడిఎఫ్ అభ్యర్థి వీర రాఘవులకు 16 వేల 806 ఓట్లు వచ్చాయి. నిన్నటి వరకు కూటమి అభ్యర్థి రాజశేఖర్ 32 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యతా ఓట్లలో 50 శాతం ఓట్లు రాలేదు. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా PRTU అభ్యర్థి గాదె శ్రీనివాసులు ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మపై గెలుపొందారు. పీడీఎఫ్ అభ్యర్థిగా బరిలో ఉన్న కోరెడ్ల విజయగౌరి సైతం భారీగా ఓట్లు సాధించి ప్రభావం చూపారు.
ఉమ్మడి కృష్ణా- గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి లక్ష్మణరావుపై ఆలపాటి రాజేంద్ర ఘన విజయం సాధించారు.
Also Read: AP MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర విజయం