గోదావరిలో బోటు బోల్తా.. అక్కడికి ఎందుకు వెళ్లారో తెలిస్తే షాక్‌ అవుతారు..


రాజమండ్రి పుష్కరాల రేవు వద్దనుంచి సోమవారం మధ్యాహ్నం పన్నెండు మందితో వెళ్లిన బోటు ఒకటి బోల్తాపడిన ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారు.. సాయంత్రం తిరిగి వస్తున్న క్రమంలో రైలు వంతెన 10వ పిల్లర్‌ వద్దకు చేరుకునే సరికి బోటులోకి నీరు రావడంతో బోటు బోల్తాపడినట్లు అధికారులు తెలిపారు. గల్లంతయిన వారికోసం గాలించగా రాత్రి ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి.. మృతులు చావల అన్నవరం(54), గాడ రాజా(23) గా పోలీసులు గుర్తించారు. వీరు రాజమండ్రి శివారు సింహాచల నగర్‌, భవానీపురంకు చెందిన వారిగా గుర్తించి ృతదేహాలను పోస్ట్‌మార్టంకు పంపించారు పోలీసులు.. బోటు బోల్తా పడిన విషయం సురక్షితంగా బయటపడిన వారి ద్వారా అక్కడున్నవారికి తెలిసింది.. దీంతో ఈవిషయం పోలీసులకు తెలియడంతో హుటాహుటీన అక్కడకు చేరుకుని ఆరా తీశారు.. వెళ్లిన వారిలో పది మంది సురక్షితంగా బయటకు వచ్చామని అయితే ఇద్దరు మాత్రం గల్లంతయ్యారని చెప్పడంతో ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహాలు లభ్యమయ్యాయి..


మద్యం సేవించేందుకు వెళ్లి మృత్యువాత..


ఇటీవల కాలంలో గ్రూపులుగా ఏర్పడి మద్యం సేవించడం ఒక అలవాటుగా మారింది.. ఇదే తరహాలో మద్యం సేవించేందుకు పన్నెండు మంది కలిసి మత్స్యకారులకు చెందిన ఓ బోటులో గోదావరి మద్యలో ఉండే లంకలోని ఇసుక తెన్నెలపై మద్యం సేవించేందుకు వెళ్లారని సురక్షితంగా బయట పడిన 10 మంది ద్వారా అసలు సంగతి రాబట్టారు పోలీసులు.. సోమవారం మధ్యాహ్నం 12 మంది వెళ్లామని రాత్రి 7 గంటల వరకు అక్కడే గడిపి తిరిగి వస్తున్నప్పుడు బోటు కింద కన్నం పడి నీళ్లు లోనికి వచ్చాయని వారు తెలిపారు. అయితే నీరు చాలా వేగంగా బోటులోకి రావడంతో కొద్దిసేపటికే బోటులోకి బాగా నీరు వచ్చి బోల్తాపడిరదని చెప్పారు. ఎవరికి వారు చెల్లాచెదురై ఈతకొట్టుకుంటూ ఒడ్డుకు రాగలిగామని, అయితే చావల అన్నవరం, గాడ రాజు మాత్రం గోదావరిలో గల్లంతయ్యారని వెల్లడిరచారు. కేవలం మద్యం సేవించడానికి వెళ్లామని చెప్పడంతో ఒకింత ఆశ్చర్యానికి గురైన పోలీసులు వెంటనే గల్లంతైనవారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. 


మద్యంతోపాటు పేకాట ఆడేందుకు వెళ్లారా...


గోదావరిలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న ప్రమాదంపై మాత్రం రాజమండ్రి డీఎస్పీ రమేష్‌బాబు ఆధ్వర్యంలోపోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.. సురక్షితంగా బయటపడిన పది మంది చెబుతున్నట్లు నిజంగానే వీరు కేవలం మద్యం సేవించడానికే గోదావరి మధ్యలోనున్న లంకలోకి వెళ్లారా లేదా అన్నదానిపై విచారణ చేస్తున్నారు.. అయితే గోదావరి మధ్యలో ఇసుక మేటలు వేసి లంకలుగా ఏర్పడడంతో అక్కడకు వెళ్లి కొందరు అసాంఫీుక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారం ఇప్పటికే పోలీసుల దృష్టికి వచ్చింది.. వీరు కూడా కేవలం మద్యం సేవించేందుకే కాకుండా పేకాట ఆడేందుకు వెళ్లారన్న సమాచారంతో ఆదిశగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..