Janasena Chief Pawan Kalyan Assets - పిఠాపురం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఇదివరకే ర్యాలీగా బయలుదేరిన పవన్ కళ్యాణ్ ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం టీడీపీ ఇంచార్జి వ‌ర్మతో పాటు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు.

Continues below advertisement


ఈ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో గత అయిదు ఆర్థిక సంవత్సరాల ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు జనసేనాని తెలిపారు. గత 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ సంపాదన రూ.114.76,78,300 (నూట పద్నాలుగు కోట్ల 76 లక్షల 78 వేల 3 వందల రూపాయలు)గా ఉంది. తన సంపాదనకు సంబంధించి ఆదాయ పన్నుగా రూ.47,07,32,875 (47 కోట్ల 7 లక్షల 32 వేల 8 వందల డెబ్భై ఐదు రూపాయాలు), జీఎస్టీ రూపంలో మరో రూ.28,84,70,000 (28 కోట్ల 84 లక్షల 70 వేల రూపాయలు) పవన్ కళ్యాణ్  చెల్లించారు. 


పవన్ కళ్యాణ్ అప్పులు
ఎన్నికల అఫిడవిట్ లో పవన్ కళ్యాణ్ తన అప్పుల గురించి వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కు ఓవరాల్ గా అప్పులు రూ.64,26,84,453 (64 కోట్ల 26 లక్షల 84 వేల 4 వందల 53 రూపాయలు) ఉన్నాయి. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి రూ.17,56,84,453 (17 కోట్ల 56 లక్షల 84 వేల 4 వందల యాభై మూడు రూపాయలు) అప్పుగా తీసుకున్నారు. వ్యక్తుల నుంచి పవన్ కళ్యాణ్ తీసుకున్న అప్పులు రూ.46,70,000 (46 లక్షల 70 వేల రూపాయలు) ఉన్నాయి.