Eluru Mayor Resigns to YSRCP:  అమరావతి: ఏపీ ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని మూటకట్టుకున్న వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎన్నికల్లో వైసీపీకి ఓట్ షేర్ వచ్చినా, కేవలం 11 ఎమ్మెల్యే సీట్లు నెగ్గడంతో మాజీ ఎమ్మెల్యేలు వైసీపీని వీడుతున్నారు. తాజాగా ఏలూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్.ఎమ్.ఆర్ పెదబాబు మంగళవారం టీడీపీలో చేరారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ(చంటి) నేతృత్వంలో మేయర్ దంపతులతో పాటు పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.


టీడీపీలో చేరిన వారిలో ఈయూడీఏ మాజీ ఛైర్మన్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ మంచం మైబాబు, ప్రస్తుత వైసీపీ ఏలూరు పట్టణ అధ్యక్షులు బి. శ్రీనివాస్ తో పాటు పలువురు వైసీపీ నేతలు ఏపీ విద్యాశాఖ, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఉండవల్లి నివాసంలో పలువురు నేతలకు కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. 


ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ఏపీ ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీ ఇంకా గుణపాఠం నేర్చుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంపై అని, సామాన్యుడి కోసం పనిచేస్తుందన్నారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.