BJP AP Chief Somu Veerraju Interesting comments on Janasena And TDP Alliance :ఏపీలో గత కొన్నిరోజులుగా పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాపిక్ రాజకీయ పొత్తులు. ఎన్నికలకు ఏ పార్టీలు, ఎవరితో కలిసి వెళ్తాయనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీకి వెళ్తామని అధికార వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారు. పొత్తుల విషయంపై తాము క్లారిటీగానే ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతుందని మరోసారి క్లారిటీ ఇచ్చారు. అయితే జనసేన, టీడీపీ కలుస్తాయా, లేదా అనేది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను అడగాలని, ఆయన నోటి వెంటే ఆ మాట వినాలన్నారు.
పవన్ కళ్యాణ్‌ను అడగండీ..
నంద్యాల జిల్లాలో పర్యటించిన సందర్భంగా, అధికార వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదని, కలిసే ఉండాలని పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఏలూరులో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. బీజేపీ, జనసేన పొత్తు గురించి అందరికీ తెలుసునని, అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీతో కలిసి వెళ్తారా అని సోము వీర్రాజును మీడియా అడిగింది. టీడీపీతో జనసేన పొత్తుపై పవన్ కళ్యాణ్‌ను అడగాలన్నారు. మేం, జనసేన కలిసే ఉన్నామని, తమ మధ్య పొత్తు ఉందని క్లారిటీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయమన్నారు. తాము ఎవరితో పొత్తు పెట్టుకున్నా, అది ప్రజల ప్రయోజనాల కోసమే అన్నారు.
బీజేపీ డిమాండ్‌తోనే రీపోస్టుమార్టం..
శ్రీ సత్యసాయి జిల్లాలో బీఫార్మసీ విద్యార్థిని మరణించిన కేసు (B Pharmacy Student Death Case)లో అనుమానంతో రీపోస్టుమార్టం చేయాలని బీజేపీ డిమాండ్ చేసిందన్నారు. దాని ఫలితంగానే రీపోస్టుమార్టం జరిపించి పోలీసులు నిజాలు వెల్లడించారని గుర్తుచేశారు. ఇదే విషయంపై తమ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మరికొందరు నేతలతో కలిసి ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిశారని చెప్పారు. ప్రధాన నిందితుడు సాధిక్‌తో పాటు అతడికి సహకరించిన కుటుంబసభ్యులు, మరికొందరిపై సైతం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన డిమాండ్ చేశారు. నేడు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ నిందితుడు సాధిక్‌ను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం అత్యాచారం సెక్షన్ కూడా కేసులో చేర్చినట్లు చెప్పడంతో తమ అనుమానాలే నిజమయ్యాయని, తేజస్విని కుటుంబసభ్యులు, బంధువులు చెబుతున్నారు.
Also Read: YSRCP News: మే 11 నుంచి ‘గడప గడపకూ వైఎస్ఆర్’, పూర్తి వివరాలు ఇవీ