Andhra Pradesh Weather Latest: బంగాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇంకా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు పేర్కొన్నారు. తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. 


దక్షిణకోస్తా-ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. ప్రస్తుతానికి అక్కడే స్థిరంగా కొనసాగుతోందని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ వచ్చే అవకాశం ఉంది. 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందన్నారు.


Also Read: తిరుపతిలో అపచారం.. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టిన ఆగంతకులు


ఈ అల్పపీడన ప్రభావంతో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నాలుగు రోజుల పాటు వాతావరణం పరిశీలిస్తే.. 


డిసెంబర్ 25, బుధవారం : శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.


ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం మరియు అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.


డిసెంబర్ 26, గురువారం : ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.


ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, వైఎస్ఆర్ మరియు అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.


డిసెంబర్ 27, శుక్రవారం : ప్రకాశం, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.


డిసెంబర్ 28, శనివారం : రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుంది.


వర్షాల పడనున్న వేళ వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసారు.


Also Read: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్


తెలంగాణలో వాతావరణం.


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలుకురుస్తాయని అంటున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం ఉదయం పలు జిల్లాల్లో పొగమంచు ఏర్పాడుతుందని తెలిపింది. వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తోంది. అల్పపీడన ప్రభావం కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలపై కూడా పడుతోంది. సాధారణం కంటే  2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని అన్నారు.