ఏపీ పీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి రాజకీయంగా ఎందుకు మౌనం ఉన్నారు.. దీని వెనుక గల కారణాలు తెలుసుకునేందుకు ఏపీ ప్రజలు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఆయన టీడీపీలో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. ఆ వదంతులు, కథనాలపై రఘువీరారెడ్డి మాత్రం స్పందించలేదు. దీంతో ఆయన ఎప్పుడు మౌనం వీడతారా అనే అంశంపై రఘువీరారెడ్డి గత రెండేళ్లుగా మీడియాతో మాట్లాడకుండా స్వగ్రామంలో దేవాలయాల నిర్మాణం పనులలో, కుటుంబసభ్యులతో బిజీగా గడుపుతున్నారు.


కొద్దిరోజుల క్రితమే ఆ దేవాలయాల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఆయన రాజకీయాలపై అప్ డేట్ వస్తుందని ఆయన అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం భావించారు. ఆయన కాంగ్రెస్‌లో కొనసాగుతారా.. లేక వేరే పార్టీ మారే యోచనలో ఉన్నారా.. అసలు రాజకీయాల్లో కొనసాగుతారా, లేక తప్పుకునేందుకు ఇలా వ్యవహరిస్తున్నారా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.


రఘువీరారెడ్డి సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. ఆయన ఎట్టి పరిస్థితుల్లోను కాంగ్రెస్ ను వీడేసమస్యే లేదంటున్నారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని, త్వరలోనే పార్టీ కార్యక్రమాలతో బిజీ అవుతారని తెలుస్తోంది. ఇఫ్పటికే తన సన్నిహితులతో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు చెప్తున్నారు. ఆయితే త్వరలోనే రఘువీరారెడ్డి మౌనం వీడుతారన్న ప్రచారం ఊపందుకుంది. మరోవైపు టీడీపీ వర్గాలు పార్టీ మారడంపై రఘువీరారెడ్డిని సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు దఫాలుగా రఘువీరారెడ్డిని సంప్రదించిన టీడీపీ శ్రేణులకు సానుకూల స్పందన లభించలేదని సన్నిహితులు చెబుతున్నారు.


ఇప్పటికే యాదవ సామాజికవర్గానికి వైఎస్సార్‌సీపీలో ప్రాధాన్యత లభించలేదన్న కోపంలో వున్న ఆ సామాజికవర్గ నేతలు కూడా టీడీపీలో ఉన్నవారు సైతం ఆయన్ను సంప్రదించనట్లు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి అనంతపురం జిల్లా అభివృద్దిలో కీలకపాత్ర పోషించిన నాయకుడు అని, ఆయనను ఓ సామాజికవర్గం నేతగా చూడవద్దు అని అభిమానులు అంటున్నారు. రఘువీరారెడ్డి టీడీపీలో చేరకపోతే ఆయన కూతురు అమృతా వీర్ ఒత్తిడి కుటుంబంపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇన్ని జరుగుతున్నా కుటుంబసభ్యులు గానీ, రఘువీరారెడ్డిగానీ ఈ వదంతులపై స్పందించడం లేదు. జనవరిలొ రఘువీరారెడ్డి రాజకీయాలపై మాట్లాడే అవకాశాలున్నాయని.. పార్టీలోనే కొనసాగుతూ తన రాజకీయ వారసురాలిగా  అమృతావీర్ ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కుటుంబంలో దీనిపై చర్చ జరిందని, త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉందని సన్నిహిత వర్గాల సమాచారం. 


ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రఘువీరారెడ్డి చేసిన అభివృద్ది నేపథ్యంలో అక్కడ నుంచే తన కుటుంభసభ్యుల్లో ఒకరిని పోటీలో దింపే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో రఘువీరారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమిచెందారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఇప్పటినుంచే రాజకీయంగా యాక్టివ్‌గా ఉండాలని ఆ కుటుంబంపై ఒత్తిడి రోజురోజుకూ పెరిగిపోతోంది. బీసీల బలమైన నాయకుడిగా ముద్రపడ్డ రఘువీరారెడ్డి మౌనం అనంతపురం జిల్లాకు మేలు చేయదని.. హంద్రీనీవా జలాలను జిల్లాకు తీసుకురావడం కానీ, వెనుకబడ్డ కల్యాణదుర్గం, మడకశిర ప్రాంతాల్లో అభివృద్దిలో ఆయన కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్‌లో కొనసాగడం ఇష్టం లేకపోతే టీడీపీలోకి రావాలని ఆయనకు ఆహ్వానాలు అందుతున్నాయి. 


Also Read: jagan CBI Court : అందుకే సీబీఐ కోర్టుకు హాజరు కావడం లేదు..మెమో సమర్పించిన సీఎం జగన్ !


Also Read: Weather Updates: తెలంగాణలో 11 జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌.. చలి గాలులకు వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు


Also Read: Biryani: మనోళ్లు మాములుగా తినలేదుగా... నిమిషానికి ఎన్ని బిర్యానీలు కుమ్మేశారో తెలిస్తే షాకవుతారు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి