ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి ఉత్సవాల సంబంరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమ్మవారికి పసుపు కుంకుమలు, పట్టు వస్త్రాలను దేవస్థానం అనువంశిక ధర్మకర్తలు పూసపాటి అశోక్ గజపతి రాజు సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడం మహ భాగ్యంగా భావిస్తున్నా అని పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరారు. పండగ సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ప్రజలందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్టు అశోక్ గజపతి రాజు చెప్పారు.
పైడితల్లి అమ్మవారి ఉత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి చెప్పారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ పైడి తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైడి తల్లి అమ్మవారి ఉత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, అమ్మవారి దర్శనానికి నిన్న, ఈ రోజు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారాన్నరు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు విధిగా మాస్క్ ధరించి పూర్తి స్థాయిలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సహకరించాలన్నారు. అలాగే పైడి తల్లి అమ్మవారి ఆశీసులతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు.
పైడితల్లమ్మ ఉత్సవం సందర్భంగా సోమ, మంగళవారాల్లో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సమీపంలోని మద్యం దుకాణాలు మూసి వేయించాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులను కలెక్టర్ సూర్యకుమారి ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశా రు. ఉత్సవాలు జరిగే రెండు రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, నగరానికి సమీపంలో ఉన్న మద్యం దుకాణాలు, బార్లు, కళ్లు దుకాణాలు తెరవరాదని సూచించారు. శాంతి భద్రత ల కాపాడేందుకు, ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also Read: Kurnool Crime: భర్త గొంతుకు టవల్ చుట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత ప్రియుడితో కలిసి..
Also Read: 4 రోజుల్లో రూ.1331 కోట్లు లాభం.. ఆ రెండు టాటా కంపెనీలతో పెరిగిన ఝున్‌ఝున్‌వాలా సంపద
Also Read: Bank Charges: బ్యాంకు ఛార్జీలతో విసిగిపోయారా! ఇలా చేస్తే తక్కువ రుసుములే పడతాయి