Producer Tripuraneni Chittibabu made sensational comments on AP Deputy CM Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. పదేళ్లకుపైగా కష్టపడి పార్టీకి సంచలన విజయాలను అందించారు. కూటమిలో చేరి వంద శాతం స్ట్రైక్ రేట్ తో పోటీకి నిలబెట్టిన వారందర్నీ గెలిపించుకున్నారు. ఇప్పుడు ఆయన హిందూత్వం వినిపిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని కొంత మంది మాత్రం ఆయనను గుర్తించడానికి ఇష్టపడలేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా సినీ పరిశ్రమలో నిర్మాతగా.. రాజకీయ విశ్లేషకుడిగా పేరున్న త్రిపురనేని చిట్టిబాబు డిప్యూటీ సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ఆర్‌సీపీలో ఇప్పుడు రాజ్యసభ సభ్యుడి పదవికి రాజీనామా చేసి.. పూర్తిగా రాజకీయాలకు సన్యాసం ప్రకటించిన విజయసాయిరెడ్డి విషయం హాట్ టాపిక్ అవుతోంది. విజయసాయిరెడ్డి పవన్ కల్యాణ్ దెబ్బకే ఇలా చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై ఓ యూట్యూబ్ చానల్ తో మాట్లాడిన త్రిపురనేని చిట్టిబాబు అసలు ప్రతీ దాన్ని పవన్ తో ఎందుకు ముడిపెడుతున్నారని ప్రశ్నించారు. పవన్ దెబ్బ ఏముందని.. లోకేష్ దెబ్బకు పవన్ ఎలా గిలగిల్లాడతారో తెలియదన్నారు. లోకేష్, జగన్ మధ్య పవన్ ఎలా నగిలిపోతారోనన్నారు. ఇవాళ మాట్లాడింది రేపు మాట్లాడరని..రోజుకో మాట మాట్లాడతారని.. ఆయన పొలిటికల్ జోకర్ అన్నారు. అయితే ఇప్పుడు పవర్ ఉంది కాబట్టి వపర్ ఫుల్ పొటికల్ జోకర్ అన్నారు. క్షమాపణలు చెప్పాలని..సీజ్ ది షిప్ ..అని సీజ్ చేసిన షిప్‌లని అనడం ఇలా అన్ని విషయాల్లో జోకర్ అవుతున్నారని అంటున్నారు. చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
త్రిపురనేని చిట్టిబాబు నిర్మాత , రాజకీయ విశ్లేషకుడు అని చెప్పుకుంటూ యూట్యూబ్ చానళ్లకు ఇంటర్యూలు ఇస్తూంటారు. చానల్ డిబేట్లకు హాజరవుతూంటారు. త్రిపురనేని చిట్టిబాబు అన్ని అంశాలపై మాట్లాడుతూ ఉంటారు. మోహన్ బాబు కుటుంబంలో ఏం జరిగిందో కూడా అంతా ఆయనకు తెలిసినట్లుగా చెబుతూంటారు . అయితే ఎప్పుడూ ఇంత సీరియస్ గా ఆయన ఇతరులపై విమర్శలు చేయలేదు.
పవన్ కల్యాణ్ తన రాజకీయ విజయాలతో ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఆయన రాజకీయ వ్యూహాలను అయన అమలు చేస్తున్నారు.అయితే కొన్ని ప్రకటనలు చేయడం సంచలనంగా మారుతోంది. ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో త్రిపురనేని చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానూ వైరల్ అవుతున్నాయి. ఆయనపై జనసైనికులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంది.
Also Read: ఏడాది తర్వాత గిఫ్ట్ కార్డుల ఎక్స్‌పైర్ - అమెజాన్‌పై డిప్యూటీ సీఎం పవన్ అసంతృప్తి