Pawan expressed his displeasure that the buyers of Amazon gift cards are losing money: అమెజాన్ లో గిఫ్టు కార్డులు కొన్న వారు తాము నష్టపోతున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. వారు లేనెత్తిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న పవన్ కల్యాణ్.. ఈ అంశంపై ట్విట్టర్‌లో స్పందించారు. అమెజాన్ వినియోగదారుల గడువు ముగిసిన గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ నిద్రాణ ఖాతాల్లోకి వెళ్లిపోయేలా చేయడం మంచిది కాదన్నారు. గడువు ముగిసిన గిఫ్ట్ కార్డుల నుండి బ్యాలెన్స్‌లను కోల్పోయే సమస్యను జనసేన ఆఫీస్ కూడా ఎదుర్కొందన్నారు. చాలా మంది వినియోగదారులు కష్టపడి సంపాదించిన డబ్బు అమెజాన్ గిఫ్టు కార్డుల్లో నిలిచిపోతోందని.. చివరికి అది అందకుండా పోతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. 295 మిలియన్లకు పైగా భారతీయులు ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లను చురుకుగా ఉపయోగిస్తున్నారని పవన్ తెలిపారు. అమెజాన్ ఇండియాలో 1 బిలియన్ కంటే ఎక్కువ గిఫ్ట్ కార్డులు కొనుగోలు చేశారని.. గుర్తు చేశారు. ప్రీపెయిడ్ చెల్లింపు పరికరాలపై RBI మార్గదర్శకాల ప్రకారం, అన్ని PPIలు కనీసం ఒక సంవత్సరం చెల్లుబాటును కలిగి ఉండాలని పవన్ స్పష్టం చేశారు. ఒక సంవత్సరం పాటు ఉపయోగించుకోకపోతే ముందస్తు నోటీసు తర్వాత మాత్రమే ఖాతాను ఇనాక్టివ్ చేయాలన్నారు. బ్యాలెన్స్‌ను మూలానికి తిరిగి ఇవ్వాలి లేదా KYC-లింక్డ్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలని స్పష్టం చేశారు.అలా చేయకపోవడం వల్ల వినియోగదారులు నష్టపోతున్నారని తెలిపారు.
పవన్ కల్యాణ్ లేవనెత్తిన విషయం చిన్నదిగానే కనిపిస్తుంది కానీ కోట్ల మంది కి సంబంధించిన కొన్ని వందల కోట్ల రూపాయలకు చెందినదని భావింవచ్చు. చాలా మందిఅమెజాన్ లో మనీ లోడ్ చేసుకుని వస్తువులు కొంటూ ఉంటారు. కొంత మందికి కార్పొరేట్ గిఫ్టు కార్డులు వస్తాయి. మరికొంత మందికి మరో విధంగా అమెజాన్ మనీ వస్తుంది. ఇలా వచ్చేవి సొంత డబ్బులు. వాటిని ఏడాది వరకూ వాడకపోతే.. ఒక వేల అకౌంట్ యాక్టివ్ గా ఉంచకపోతే. ముందుగా సంప్రదించి అందులో ఉన్నడబ్బులన్నీ బ్యాంకు ఖాతాలకుబదిలీ చేసిన తర్వాతనే నిలిపివేయాలి. కానీ అమెజాన్ వ్యవహారం తేడాగా ఉంటోంది. అందుకే పవన్ కల్యాణ్ స్పందించారు. మరి అమెజాన్ స్పందిస్తుందా?