యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'తండేల్' (Thandel Movie). ఇందులో ఆయనకు జంటగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) సందడి చేయనున్నారు. థియేటర్లలోకి ఫిబ్రవరి 7న సినిమా రానుంది. మరి, ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందో తెలుసా?
జనవరి 28న 'తండేల్' ట్రైలర్ విడుదలThandel Trailer Release Date: 'తండేల్' చిత్ర బృందం ఇవాళ ట్రైలర్ విడుదల తేదీని వెల్లడించింది. ఈ నెల (జనవరి) 28న (Thandel Trailer out on January 28th)తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలలో ట్రైలర్ విడుదల కానుందని సమాచారం.
'కార్తికేయ 2' సినిమాతో పాన్ ఇండియా విజయం అందుకున్న యువ దర్శకుడు చందూ మొండేటి. ఆ సక్సెస్ తరువాత ఆయన డైరెక్షన్ చేస్తున్న చిత్రమిది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ పతాకం మీద బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన పాటలు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి.
హైలెస్సో హైలెస్సా... ఇదీ బావుందబ్బా!'తండేల్' సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. 'పుష్ప 2 ది రూల్' విజయం తర్వాత ఆయన సంగీతంలో వస్తున్న చిత్రమిది. ఆల్రెడీ విడుదలైన పాటల్లో డీఎస్పీ తన మార్క్ చూపించారు.
'తండేల్' సినిమా నుంచి మొదట 'బుజ్జి తల్లి...' సాంగ్ విడుదల అయింది. అందులో మెలోడీ అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత 'నమో నమః శివాయ...' పాటను విడుదల చేశారు. భక్తులకు పూనకాల తెప్పించేలా ఆ పాట ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇక తాజాగా విడుదల చేసిన 'హైలెస్సో హైలెస్సా...' పాట కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి వివరించే పాట ఇది. సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య ఉన్న అనురాగాన్ని కూడా అద్భుతంగా ఆవిష్కరించింది.
Also Read: మహేష్ బాబు పాస్ పోర్ట్ లాక్కున్న రాజమౌళి... సీజ్ ద లయన్, SSMB29 షూటింగ్ షురూ
'తండేల్' సినిమాకు జాతీయ పురస్కార గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగల కళా దర్శకత్వం వహిస్తుండగా... శ్యామ్‌దత్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.