సినిమాల్లో మళ్ళీ గేర్ మార్చిన పవన్, ఫ్యాన్స్‌కి పండగ చేస్తున్నారు. వచ్చే ఏడాది వరుస రిలీజెస్‌తో హోరెత్తించనున్నారు. సినిమాలు, హడావుడి, ఆ మాస్ అంతా సరే, మరి పాలిటిక్స్ సంగతేంటి? ఈ సినిమాల హడావుడిలో జనసేన ఎక్కడుంది? మళ్ళీ సినిమాల్లో స్పీడ్ పెంచుతుంటే,  కొంతమంది పవన్ బ్యాక్ టూ పెవిలియన్ అని కామెంట్ చేశారు.  వాళ్లందరికీ ఒకటే సమాధానమన్నట్టు , బతకడానికి సినిమాలు చేస్తా.. జనాల కోసం రాజకీయాల్లో వుంటానని తేల్చిచెప్పారు పవన్. అయితే  'పొలిటికల్ పవర్ స్టార్‌' అయ్యేందుకు పవన్ కల్యాణ్ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటీ? ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికి జనసేనకు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉండొచ్చు చూద్దాం.


2019 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురయ్యాక  పవన్ లాంటి బడా సినిమా స్టార్.. అయినా మళ్లీ రాజకీయాల్లో కొనసాగడం చాలా ప్లస్ పాయింట్. ఎన్నికలు అయిపోయాక... జనసేన తరఫున ఒకే ఎమ్మెల్యే మాత్రమే అడుగుపెట్టినా.. పవన్ వెనక్కి తగ్గలేదు. మళ్లీ జనంలోకే వెళ్లారు. నిలకడ వుంది కాబట్టే ఇన్నాళ్ళున్నాడని జనం అర్థం చేసుకుంటారు. కచ్చితంగా ఇదొక  పాజిటివ్  పాయింట్.


ఎన్నికల్లో ఓడిపోయాక.. చాలా మంది నేతలు రాజకీయాల నుంచి తప్పుకుంటారు. ఉదాహరణకు చిరంజీవినే తీసుకోండి. పరిస్థితులు అనుకూలించక.. రాజకీయాల నుంచి తప్పుకొని.. మళ్లీ సినిమాలు చేస్తున్నారు. కానీ పవన్ పట్టుదలతో ఉన్నారు. ఇది ఫ్యాన్స్‌కి ఉత్సాహానిచ్చే అంశం.  పట్టుదలే భవిష్యత్‌లో ఫలితాన్ని మర్చే అవకాశం ఎక్కువ.
 
కిందటి ఎన్నికలకు ముందు వరకు పవన్ గత ప్రభుత్వంతో కలిసి ఉన్నారు. అయితే సరిగా ఎన్నికల సమయంలో టీడీపీతో పొత్తు లేకుండా పోటీ చేశారు. అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా... కొంతకాలం వ్యతిరేకంగా ఉన్నారు. కానీ ఇప్పుడు అలా కాదు. మంచి పనులు చేస్తే.. ప్రభుత్వాన్ని అభినందిస్తూనే.. కొన్నింటిని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత.. అనే స్టాండ్ క్లియర్‌గా తెలుస్తోంది. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో జనసేన లాభపడే ఛాన్స్ ఉంది.


పవన్ ప్రస్తుతానికి బీజేపీతో పొత్తులో ఉన్నారు. బీజేపీతోనే ఉంటారా.. ఉండరా అనేది తెలియాల్సి ఉంది. ఎలాంటి వ్యూహంతో వెళ్తారనేది బహుశా వచ్చే యూపీ ఎన్నికల ఫలితాలతోనే.. లేకుంటే ఆ తర్వాత 6 నెలలకో  తెలుస్తోంది. పొత్తును బట్టి కూడా జనసేన ఫలితాలు మారే అవకాశం ఉంటుంది.


అయితే గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి.. ఓడిపోయారు పవన్ కల్యాణ్. అయితే ఈసారి క్షేత్రస్థాయిలో పరిశీలించే.. ఎన్నికల్లో పవన్ పోటీ చేసే ఛాన్స్ ఎక్కువ. ఏయే అంశాల మీద రెగ్యులర్‌గా జనంలోకెళ్లాలనే వాటి మీద పవన్ ఆల్‌రెడీ దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు జనంలోకి వెళ్తూనే ఉన్నారు.


ఇక పవన్ కల్యాణ్‌కి ఫ్యాన్స్ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎక్కడికి వెళ్లినా.. అభిమానులు వేలల్లో వచ్చేస్తారు. కిందటి ఎన్నికల్లో ఓట్ల రూపంలోకి ఫ్యాన్స్ అభిమానం చాలా వరకే రాలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్స్ కూడా ఓట్లు వేస్తే.. పవన్ కల్యాణ్‌కి చాలా అడ్వాంటేజ్.


Also Read: Pavan Kalyan Birthday: పవన్ కళ్యాణ్ బర్త్‌ డే స్పెషల్.. జనంలో ఉంటాడు.. జనంలా ఉంటాడు, ఇదీ పవర్ స్టారంటే!