PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN) యోజన.. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ.6000 ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ప్రారంభించిన సంక్షేమ పథకం. ఈ పథకం కింద అర్హులైన రైతులకు మూడు విడతల్లో రూ.2,000 చొప్పున ఏడాది రూ.6 వేలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఇటీవల 22వ వాయిదా కింద 9.32 కోట్లకు పైగా రైతులు రూ.2,000 ఆర్థిక సహాయం అందుకున్నారు.  

Continues below advertisement

పీఎం-కిసాన్ 23వ వాయిదాపై అప్డేట్ వచ్చింది. జూన్ 18న వారణాసిలో ప్రధాని మోదీ 9 కోట్ల మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో సుమారు రూ.20,000 కోట్లు నేరుగా బదిలీ చేయనున్నట్లు  కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.  పీఎం కిసాన్ పథకం అర్హతలు, దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు తెలుసుకుందాం.  

పీఎం కిసాన్ అర్హులు?

భారతీయ పౌరుడై ఉండాలి.  రెవెన్యూ గ్రామాలలో 2 హెక్టార్ల లోపు భూ యజమానులు ఆధార్ నంబర్‌ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి eKYC పూర్తి చేయాలి.   

Continues below advertisement

PM-KISAN దరఖాస్తు విధానం  

పీఎం కిసాన్ వెబ్ సైట్, సీఎస్సీ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. భూరికార్డులు, రైతు రిజిస్ట్రీలో నమోదు వివరాలతో అప్లై చేసుకోవచ్చు.  

ఆన్ లైన్ ప్రాసెస్ 

PM-KISAN అధికారిక పోర్టల్ https://pmkisan.gov.in/ సందర్శించండి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, ఆధార్ ధృవీకరణ చేయండి. గ్రామ స్థాయి అధికారులు భూమి వివరాలు ధృవీకరిస్తారు.రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. 

అవసరమైన పత్రాలు

ఆధార్ కార్డు  భూ యాజమాన్య పత్రాలు  IFSC కోడ్‌తో బ్యాంకు అకౌంట్ ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు   

PM-KISAN స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? 

1. PM-KISAN అధికారిక పోర్టల్‌కు వెళ్లండి.2. హోమ్‌పేజీలోని “Know Your Status” పై క్లిక్ చేయండి.3. అవసరమైన ఫీల్డ్‌లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేయండి.

Also Read: ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్.. ఏడాదికి 9 సిలిండర్లు, రూ.300 సబ్సిడీ.. PMUY అర్హతలు, అప్లై ప్రాసెస్ ఇదే!

రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తులేకపోతే

"Know Your Registration number" పై క్లిక్ చేయండిమొబైల్ నెంబర్ లేదా ఆధార్ కార్డు ద్వారా రైతు రిజిస్ట్రేషన్ నెంబర్ సెర్చ్ చేయవచ్చు. OTPతో వెరిఫై చేసి,  మీ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవచ్చు.  

4. రిజస్టర్ట్ మొబైల్ నెంబర్‌కు పంపిన OTPని ఉపయోగించి వెరిఫికేషన్ పూర్తి చేయండి.5.  వెరిఫికేషన్ తర్వాత PM KISAN వివరాలను స్క్రీన్‌పై చూడవచ్చు.  

Also Read: మహానాడులో భారతరత్న తీర్మానం - ఈసారి ఎన్టీఆర్‌కు గౌరవం దక్కేనా? చంద్రబాబు ఏం చేయబోతున్నారు?

పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా 

పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉందో లేదో రైతులు తనిఖీ చేసుకోవచ్చు. ఈ జాబితాలో గ్రామంలోని పీఎం కిసాన్ అర్హులందరి పేర్లు ఉంటాయి. 

1. PM-KISAN పోర్టల్‌కు వెళ్లండి.2. హోమ్‌పేజీలో, “Farmers Corner” విభాగంలో “లబ్ధిదారుల జాబితా” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.3. తదుపరి పేజీలో రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం పేరు ఎంటర్ చేసి రిపోర్టు పొందవచ్చు.  4. మీ గ్రామంలో PM KISAN అర్హుల పూర్తి జాబితా డిస్‌ప్లే అవుతుంది. 

Also Read: ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు

PM-KISAN eKYCని పూర్తి చేసే ప్రక్రియ

ఈ పథకం కింద నమోదు చేసుకున్న లబ్ధిదారులందరూ eKYC తప్పనిసరి.  

1. PM-KISAN పోర్టల్‌కు వెళ్లండి.

2. e-KYC పై క్లిక్ చేయండి  

3. అవసరమైన ఫీల్డ్‌లో మీ ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేసి, సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయండి.

4. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు పంపిన OTP వెరిఫై చేసి eKYCని పూర్తి చేయండి. మీ దగ్గరలోని CSC సెంటర్ ద్వారా ఆఫ్‌లైన్‌లో కేవైసీ పూర్తి చేయవచ్చు.