Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు.. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో  పాల్గొన్నారు. పెదకూరపాడు బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు... వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్టంలో జగన్ విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అభివృద్ధిని కొనసాగిస్తే... ఏపీలో వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేస్తుందని ఆరోపించారు. అమరావతి పేరు వింటేనే ఒళ్లు పులకరిస్తుందన్నారు. జగన్ బ్యాచ్ ఎవ్వరిని వదలనని చంద్రబాబు హెచ్చరించారు. అన్ని రాష్ట్రాలలో  కన్నా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయన్నారు. వైసీపీ పాలనలో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. యర్రగొండపాలెంలో ఓ మంత్రి నాపై రాళ్లదాడి చేయించారని ఆరోపించారు. ఎస్సీలకు న్యాయం చేసిన ఏకైక  పార్టీ  టీడీపీ అన్నారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి జస్టిన్ పున్నయ్య కమిషన్ నియమించామన్నారు. ఎస్సీ వర్గాలు సమానంగా అభివృద్ధి‌ చెందాలని వర్గీకరణ తెచ్చామన్నారు. గూగుల్ లో‌ 693 కొడితే జగన్ వ్యవహారం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. డ్వాక్రా‌ సంఘాలు నా మానస‌ పుత్రిక అన్న చంద్రబాబు... మహిళలకు వడ్డీ‌ లేని రుణాలు ఇచ్చానన్నారు.  


ఇసుక రీచ్ ల నుంచి ముడుపులు 


 "నెలకు రూ.20 కోట్లు అమరావతి  ఇసుక రీచ్ ల నుంచి  తాడేపల్లికి ముడుతున్నాయి. ఎమ్మెల్యే శంకర్రావు కృష్ణా నధిలో రోడ్డు వేసి మరీ ఇసుక అక్రమంగా దోచేస్తున్నారు. గుగుల్ పే ద్వారా వైవ్ షాపులలో పేమెంట్‌ లేదంటున్నారు. వైన్ షాపులలో వాటాలు తాడేపల్లి చేర్చేందుకే గుగుల్ పే వద్దంటున్నారు. నిరుపేదలకు‌ టీడీపీ జెండా అండగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి అప్పు పుట్టడం లేదు. పబ్లిక్, ప్రైవేట్, ప్రజలు కలసి పనిచేస్తే పేదరికం లేని సమాజం సాధ్యం. నేషనల్ రోడ్లు అద్భుతంగా ఉన్నాయి. రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. జగనే రాష్ట్రానికి దరిద్రం. సైకో సీ2 కార్యక్రమం త్వరలో చేపడతాం. సైకో కరప్షన్ టు కార్యక్రమం ద్వారా వైసీపీ అవినీతిని బయటపడుతుంది. జగన్ కు ఓటు వేస్తే కట్టు బట్టలు కూడా మిగలవు. అధికారులు జైలు శిక్ష తప్పదు గుర్తు పెట్టుకోండి. ప్రజల భవిష్యత్ కోసం అమరావతి  మహానగరం నిర్మించాలని భావించాను"- చంద్రబాబు


మీ ముఖంపై మా బొమ్మ వేస్తాం


"టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. దేశంలోనే విద్యుత్  సంస్కరణలు తీసుకువచ్చిన పార్టీ టీడీపీ. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఆర్టీసీ ఛార్జీలు, చెత్తపన్ను, ఇంటి పన్నులు పెంచారు. ఇన్ని ధరలు పెంచి నంగనాచి కబుర్లు చెబుతున్నారు. ప్రజలకు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచారు. మీ ఇంటిపై జగన్ స్టిక్కర్ ఏంటి? జగన్ మోహన్ రెడ్డి ఇంటిపై వేరే వాళ్ల బొమ్మ పెడితే ఊరుకుంటారా? పోలీసులు ఇంటిపై నా బొమ్మ పెడితే ఒప్పుకుంటారా? అని ప్రశ్నిస్తు్న్నాను. నా ఇంటికి జగన్ బొమ్మ వేస్తే మీ ముఖానికి నా బొమ్మ వేస్తానని ఎమ్మెల్యేలకు చెప్పండి. సహాయనిరాకరణ చేయండి. పట్టాదారుపాసు పుస్తకంపై జగన్ బొమ్మ వేస్తున్నారు. యర్రగొండపాలెంలో ఓ మంత్రి నాపై రాళ్లు వేయించారు. నన్ను కాపాడే ప్రయత్నంలో ఎన్ఎస్జీ కమాండర్ కు తలపై గాయమైంది. ఆయనకు నాలుగు కుట్లు పడ్డాయి. ఇది రౌడీయిజం కాదా? " -చంద్రబాబు