Avinash Reddy : వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో సానుకూల ఫలితం రాలేదు ముందస్తు బెయిలివ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ విషయంలో జోక్యంచేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు వేకెషన్ బెంచ్ ముందుకే వెళ్లాలని సూచించింది. హైకోర్టు వేకెషన్ బెంచ్ విచాణ జరిపే వరకూ అరెస్ట్ నుంచి రక్షణ ఇవ్వాలని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు కోరారు. అయితే అలాంటి ఆదేశాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు వెకేష‌న్ బెంచ్ ముందు ముంద‌స్తు బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌న్న‌ సుప్రీంకోర్టు..  25న హైకోర్టు వెకేష‌న్ బెంచ్ అవినాశ్ ముంద‌స్తు బెయిల్‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని  సూచించింది.


గతంలో జూన్ 5వ తేదీకి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు 
 
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై   కోర్టుకు వేసవి సెలవులు ఉన్నందున విచారణను జూన్‌ 5కు వాయిదా వేస్తున్నట్టు ఏప్రిల్ 28న తెలంగాణ హైకోర్టు తెలిపింది.  దీనిపై స్పందించిన అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు... అప్పటి వరకు అంటే సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందని... వేసవి సెలవుల కోర్టులో విచారణ జరపాలని కోరారు. ఈ అంశంపై స్పందించిన న్యాయమార్తి... హైకోర్టు సీజేను కలవాలని సూచించారు.తర్వతా  ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ జూన్ 5కి వాయిదా పడింది. నిర్ణయం మళ్లీ అప్పుడే వచ్చే అవకాశం ఉంది. అయితే అంతకు ముందు ముందస్తు బెయిల్ పై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు హైకోర్టుకు సూచించింది. అయినా నిర్ణయం ప్రకటించకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై నిర్ణయం కోసం హైకోర్టును ఆశ్రయించే హక్కు పిటిషనర్‌కు ఉందని.. సుప్రీంకోర్టు తెలిపింది. అందుకే వెకేషన్ బెంచ్ ముందు విచారణ జరపాలని సూచించింది. గురువారం ఈ  పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.


ప్రభుత్వంపై గెరిల్లా తరహా ఉద్యమాలు చేస్తాం -కోటంరెడ్డి హెచ్చరిక


అరెస్ట్ కు సీబీఐకి ఆటంకాలు లేనట్లే ! 


తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపే వరకూ అరెస్ట్ చేయవద్దని ఆదేశాలివ్వాలన్న అవినాష్ రెడ్డి లాయర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసి పుచ్చడంతో అరెస్టుకు ఎలాంటి ఆటంకాలు లేనట్లే. నిజానికి అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడానికి సీబీఐకి గతంలోనూ ఆటంకాలు లేవు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా  హైకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి ప్రశ్నించాల్సి ఉందని సీబీఐ స్పష్టం చేసింది. అయితే అరెస్టు నుంచి రక్షణ లభించకపోయినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. విచారణకు పిలిస్తే.. అరెస్ట్ చేస్తారేమోన్న ఉద్దేశంతో అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు వివిధ కారణాలు చూపి డుమ్మా కొడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


వైసీపీ విక్టరీకి నేటితో నాలుగేళ్లు - 98.4 శాతం హామీలు నెరవేర్చామంటున్న అధికార పార్టీ


సుప్రీంకోర్టు రక్షణ ఇవ్వకపోయినా అవినాష్ రెడ్డి కష్టమే ! 


అరెస్ట్ విషయంలో సుప్రీంకోర్టు రక్షణ ఇవ్వకపోయినా సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. కర్నూలులో ఉన్న సీబీఐ అధికారులు తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చిన సీబీఐ.. మళ్లీ ఆయనకు నోటీసులు జారీ చేస్ అవకాశం లేదని.. గురువారం హైకోర్టులో జరిగిన విచారణ తర్వాత సీబీఐ తదుపరి నిర్ణయం తీసుకుంటుందన్న వాదన వినిపిస్తోంది.