YSRCP News: ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నేటితో నాలుగేళ్లు పూర్తి అవుతుంది. 50 శాతానికి పైగా ఓట్లు సంపాదిచి... 151 అసెంబ్లీ స్థానాలను, 22 ఏంపీ సీట్లను సాధించుకుంది. అయితే ఏపీ సీఎం జగన్ అధికారంలోకి రాకముందు చేసిన హామీలను.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమలు చేశామని చెబుతున్నారు అధికార పార్టీ నాయకులు. నాలుగేళ్ల పాలనలో 98.4 శాతం హామీలను నెరవేర్చామని వివరిస్తున్నారు. ప్రస్తుతం ప్రతీ కార్యకర్త ప్రజల దగ్గరకు వెళ్లి తాము చేసిన మంచి పనులు చూసే ఓటు వేయమని అడుగుతున్నట్లు తమ పాలను ఉందని సీఎం జగన్ చెప్పుకొస్తున్నారు.






బలహీన వర్గాల రాజకీయ సాధికారతకు పెద్ద పీట వేస్తూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కీలక రాజకీయ పదవులు కట్టబెట్టింది కూడా తమ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. అలాగే రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు క‌ల‌గా మిగిలిన మ‌చిలీప‌ట్నం పోర్ట్ నిర్మాణానికి వైసీపీ ప్ర‌భుత్వంలో సోమవారం శంకుస్థాప‌న చేశామని తెలిపారు. 4 బెర్తుల‌తో దాదాపు 35 మిలియ‌న్ ట‌న్నుల సామ‌ర్థ్యంతో ఈ పోర్ట్‌ను నిర్మిస్తున్నట్లు వివరించారు. అలాగే క‌నెక్టివిటీ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఏర్పాటులో భాగంగా ఈ పోర్ట్‌ను జాతీయ ర‌హ‌దారి-216కి, గుడివాడ‌-మ‌చిలీప‌ట్నం రైల్వేలైన్‌కు అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. 










విద్య ద్వారానే కుటుంబాలు సహా సమాజం అభివృద్ధి సాధ్యమని నమ్మి, ఫీజుల నియంత్రణకై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు సీఎం. గ్రామ, వార్డు సచివాలయాలు... జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిపాలన వికేంద్రీకరమ జరుగుతోందన్నారు. ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని.. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. 47 నెలల్లో డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.10 లక్షల కోట్లు జమ చేశామన్నారు. నామినేటెడ్ నుంచి కేబినెట్ వరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్ద పీట వేశామన్నారు. పంచాయతీ, మండల పరిషత్, జెడ్పీ, పురపాలక, ఉపఎన్నికల్లోనూ రికార్డు విజయాలు సాధించామన్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో ఈ ప్రభుత్వానికి 1.16 కోట్ల కుటుంబాల మద్దతు లభించిందన్ననారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు నీరాజనం పడుతున్నారని అన్నారు. అలాగే సంక్షేమ అభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రజల నమ్మకం రెట్టింపు అయిందన్నారు.  










గ్రాండ్ విక్టరీకి నాలుగేళ్లు అయిన సందర్భంగా సోషల్ మీడియాలో #YSRCPAgain2024 హ్యాష్‌టాగ్‌ ట్రెండ్ అవుతోంది. మరోసారి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్న వారు ఇందులో ట్వీట్లు చేస్తున్నారు. నాలుగేళ్ల పాలనలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, సాధించిన విజయాలు, అన్నింటినీ ప్రస్తావిస్తున్నారు నెటిజన్లు.