Omicron Case in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైంది. దీంతో ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2కు చేరుకుంది. విదేశాల నుంచి ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. అనంతరం టెస్టులు నిర్వహించగా.. ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలినట్లు ఏపీ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. 39 ఏళ్ల మహిళ డిసెంబర్ 10న కెన్యా నుంచి చెన్నై చేరుకున్నారు. చెన్నై ఎయిర్ పోర్టులో దిగిన మహిళ అక్కడి నుంచి ఏపీలోకి తిరుపతికి వచ్చారు. ఆమెకు నిర్వహించిన కరోనా టెస్టులలో డిసెంబర్ 12న పాజిటివ్ గా నిర్ధారించారు. ఏపీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ బుధవారం నాడు అధికారికంగా ప్రకటించారు.
కెన్యా నుంచి తిరుపతి.. వయా చెన్నై..
ఈ నెల 10న 39 ఏళ్ల మహిళ కెన్యా నుంచి చెన్నైకి వచ్చారు. చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి కారులో తిరుపతికి ప్రయాణించారు. తిరుపతికి చేరుకున్నాక నిర్వహించిన ఆర్‌టీపీసీఆర్ టెస్టులలో ఆమెకు డిసెంబర్ 12న కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. ఆమెతో పాటు ఆమె కుటుంబసభ్యుల నుంచి శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ జీనోమ్ సీక్వెన్సింగ్ సీసీఎంబీ సెంటర్‌కు పంపించారు. డిసెంబర్ 22న ఆ మహిళకు సోకింది ఒమిక్రాన్ వేరియంట్‌గా నిర్ధారణ అయిందని ఏపీ గవర్నమెంట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆమె కుటుంబసభ్యులకు ఆరుగురికి టెస్టులు నిర్వహించగా.. నెగెటివ్‌గా తేలిందన్నారు. అయితే క్వారంటైన్‌లో ఉంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ ఒమిక్రాన్ కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు..
ఏపీలో నమోదైన రెండో ఒమిక్రాన్ కేసు ఇది. ఇప్పటివరకూ విదేశాల నుంచి 49 మంది రాష్ట్రానికి రాగా, వారి కుటుంసభ్యులకు నిర్వహించిన ఆర్‌టీపీసీఆర్ టెస్టులలో 9 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. జీనోమ్ సీక్వెన్సింగ్ సీసీఎంబీ సెంటర్‌కు శాంపిల్స్ పంపించి తదుపరి పరీక్షలు నిర్వహించగా.. వారికి ఒమిక్రాన్ నెగటివ్‌గా వచ్చినట్లు ప్రకటనలో తెలిపారు. అయితే కోవిడ్19 నిబంధనలు పాటించాలని, ప్రజలు ఒమిక్రాన్ గురించి భయపడవద్దని సూచించారు.
ఏపీ కరోనా అప్ డేట్స్..
ఏపీలో కొత్తగా 95 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 27,233 పరీక్షలు చేశారు. వైరస్ కారణంగా కృష్ణా జిల్లాలో ఒకరు ప్రాణాలు చనిపోయారు. కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,481కు చేరుకుంది. ఒక్కరోజు వ్యవధిలో 179 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మెుత్తం 20,60,061 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 1,432 యాక్టివ్ కేసులున్నాయి.
Read Also: ఉల్లి, అన్నం, బ్రెడ్, మొక్కజొన్న... ఇలాంటివి మాడినా కూడా తింటున్నారా? క్యాన్సర్ రావచ్చు జాగ్రత్త
Also Read: Weather Updates: తెలంగాణలో 11 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్.. చలి గాలులకు వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు
Also Read: Biryani: మనోళ్లు మాములుగా తినలేదుగా... నిమిషానికి ఎన్ని బిర్యానీలు కుమ్మేశారో తెలిస్తే షాకవుతారు