నెల్లూరు జిల్లా వ్యాక్సినేషన్లో రికార్డు సృష్టించింది. అర్హులైన వారందరికీ తొలి డోసు పూర్తి చేసిన జిల్లాగా రికార్డు నెలకొల్పింది. ఏపీలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న తొలి జిల్లా కూడా నెల్లూరు కావడం విశేషం. శనివారంతో నెల్లూరు ఈ ఘనత సాధించినట్టు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు నెల్లూరు రికార్డ్ సాధించిందని తన ట్విట్టర్ ఖాతాలో వెళ్లడించారు. ఈ ఘనత సాధించడంలో తోడ్పాటునందించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదులు తెలిపారు.
దేశవ్యాప్తంగా జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు కాగా.. నెల్లూరు జిల్లాలో కూడా తొలుత హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా పంపిణీ మొదలు పెట్టారు. నెల్లూరు జిల్లాలో మొత్తం 23,69,803 మందికి టీకాలు వేయాలనేది టార్గెట్.. దాన్ని అధికారులు అధిగమించారు. ఇప్పటి వరకూ 23,69,803 మందికి తొలి డోసు పూర్తైనట్టు తెలిపారు. ఇతర ప్రాంతాలనుంచి వచ్చినవారికి కూడా టీకాలు వేయడంతో.. 100 శాతం మించి టీకాల పంపిణీ పూర్తయింది. నెల్లూరు జిల్లాలో ఆరు సార్లు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లు నిర్వహించారు అధికారులు.
నెల్లూరు జిల్లాలోని 14 సచివాలయాల పరిధిలో వయోజనులకు నూటికి నూరుశాతం వ్యాక్సినేషన్ గతంలోనే పూర్తయింది. దీంతో ఆయా సచివాలయాల అధికారులను కలెక్టర్ చక్రధర్ బాబు సన్మానించారు. ఆరోగ్య సిబ్బంది చొరవతోపాటు, రెవెన్యూ సిబ్బంది ప్రచారం, సమన్వయం వల్లే ఈ ఘనత సాధించినట్టు చెబుతున్నారు ఉన్నతాధికారులు. సచివాలయ వ్యవస్థను పూర్తిగా ఉపయోగించుకోవడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని ముందుగానే సాధించామని చెబుతున్నారు అదికారులు. అంతే కాకుండా వలస వెళ్తున్న వారిని కూడా గుర్తించి శని, ఆదివారాల్లో అలాంటి వారందరికోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టినట్టు తెలిపారు.
నెల్లూరు జిల్లాలో దాదాపు అన్ని జిల్లాల్లో 90శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. నెల్లూరు జిల్లాలో 100 శాతం టీకాల పంపిణీ పూర్తి కాగా.. శ్రీకాకుళం జిల్లాలో 89శాతం మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయింది. నెల్లూరు జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయినందుకు సీఎం జగన్ కూడా అధికారులను అభినందించారు. సెకండ్ డోస్ కూడా ఇదే స్పీడ్ లో కొనసాగించాలని సూచించారు.
ఒమిక్రాన్ అలర్ట్..
మరోవైపు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు అధికారులు. ఇప్పటికే కొవిడ్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. విదేశాలనుంచి వచ్చేవారిపై నిఘా పెంచారు.
Also Read: ఏపీ హైకోర్టు పరిధిదాటి వ్యవహరిస్తోంది... తమిళనాడు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు !
Also Read: ఆర్‌ఎంపీ ప్రాక్టీసనర్... పాలిక్లీనిక్ ఓనర్... కథ అక్కడే అడ్డం తిరిగి అడ్డంగా బుక్కయ్యాడు
Also Read: తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం..! ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ ?
Also Read: మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో