Narsapuram MPDO missing is creating a stir : ప.గో జిల్లా నర్సాపురం మండల ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యమయ్యారు. తాను చనిపోతాననే అర్థంతో ఆయన పెట్టిన మెసెజ్ చూసి కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంకటరమణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన సెల్ ఫోన్ చివరి సిగ్నల్ గోదావరి కాలువ వద్ద ఉండటంతో.. కాలువలో దూకారేమోనన్న అనుమానంతో పోలీసులు కాలువ ప్రవాహం దిశగా గాలిస్తున్నారు.
నర్సాపురం ఎంపీడీవో ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలు
విజయవాడ సమీపంలోని కానూరులో నివాసం ఉండే వెంకటరమణ నర్సాపురం ఎంపీడీవోగా పని చేస్తున్నారు. ఇటీవల ఉద్యోగానికి పదిరోజుల పాటు సెలవు పెట్టారు. మంగళవారం మచిలీపట్నం రైలు ఎక్కిన ఎంపీడీవో రమణారావు మధురానగర్‌లో దిగినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఏలూరు కెనాల్‌లో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మధురానగర్ దగ్గర కెనాల్‌లో గాలింపు చర్యలు చేపట్టారు.
కూటమి ప్రభుత్వంలో నామినేటెస్ట్ పోస్టుల భర్తీపై కసరత్తు - బీజేపీ యువనేతలకు చాన్స్ వస్తుందా ?
ఓ పంటు వేలం పాట నిధులపై వివాదం
నర్సాపురం ఎంపీడీవో వెంకటరణ పై మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఒత్తిడి ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. నర్సాపురం పట్టణ పరిధిలోని ఓ రేవుపై రెండు మండల పరిషత్‌లకు భాగస్వామ్యం ఉంది. నర్సాపురం అధికారులే నిర్వహిస్తూంటారు. ఈ క్రమంలో ఈ పంటును రోజువారీ పద్దతిలో నిర్వహిస్తున్న వ్యక్తి మండల పరిష్‌కు 54 లక్షలు బాకీ పడ్డారు. అవి ఇవ్వడం లేదు. ఇవ్వకపోయినా పట్టించుకోవద్దని మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు .. వెంకటరమణపై ఒత్తిడి తెచ్చినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఉన్నతాధికారులు తాజాగా రేవును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టంతో విషయం సీరియస్ అయింది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బ్రేక్ - చంద్రబాబు సైలెంట్‌గా పవర్ చూపించారా ?
వెంకటరమణకు ఏమైనా ముదునూరి ప్రసాదరాజుపై చర్యలు
ముదునూరి ప్రసాదరాజు వల్ల డబ్బులు చెల్లించడం లేదని...కానీ తనను బధ్యుడ్ని చేసే అవకాశం ఉండంటతో తీవ్ర ఒత్తిడికి గువుతున్నానని ఆయన పవన్ కల్యాణ్‌కు లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. తనకు ఉద్యోగమే జీవనాధారమన్నారు. ఈ అంశంపై నర్సాపురం ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ స్పందించారు. వెంకటరమణకు ఏమైనా జరిగితే ముదునూరి ప్రసాదరాజుపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వెంకటరమణ ఆత్మహత్య చేసుకుకుని ఉండవచ్చన్న అనుమానంతో విస్తృతంగా గాలిస్తున్నారు. ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లి ఉంటే బాగుండని.. ఏ అఘాయిత్యం చేసుకోకూడదని కోరుకుంటున్నారు. వెంకటరమణ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.