Kuwait Shiva Reached Home  : ..   అది బెంగళూరు ఎయిర్ పోర్టు. డిపార్చర్స్ దగ్గర చాలా ఉద్వేగ సన్నివేశాలు ఉంాటయి. కానీ ఎరైవల్స్ దగ్గర కాస్త తక్కువే. కానీ బుధవారం ఉదయం ఎరైవల్స్ దగ్గర ఓ సన్నివేశం చాలా మందిని ఉద్వేగానికి గురి చేసింది.               


గల్ఫ్ నుంచి వచ్చిన విమానంలో సాదాసీదా దుస్తులతో ఉన్న  వ్యక్తి దిగి టెర్మినల్ లోకి రాగానే అతని కుమర్తె ఏడుస్తూ వెళ్లి హత్తుకుంది. అతని భార్య కూడా అలాంటి భావోద్వేగంలోనే ఉన్నా.. అదిమి పట్టుకుంది. ఆనందాన్ని దాచుకుంది.                               


ఆ వ్యక్తి పేరు శివన్న.  కువైట్‌లో ఉపాధి కోసం వెళ్లి ఏజెంట్ మోసానికి బలైన వ్యక్తి. గత వారం ఈ వ్యక్తి ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో వైరల్ అయింది.  అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం చింతపర్తి గ్రామానికి చెందిన అయివేత శివన్న కుటుంబ ఖర్చులకు ఆదాయం సరిపోక పోతూండటంతో గల్ఫ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఓ ఏజెంట్ సాయంతో  కువైట్ కు వెళ్లాడు. అక్కడ  ఆయనకు ఇస్తామని చెప్పిన పని  కాకుండా ఒంటెల్ని కాసే పని అప్పచెప్పారు.                                 


ఇరాక్‌ సరిహద్దులోని ఎడారిలో ఒంటెలు, బాతులకు కాపలా కాయడం, పెంపుడు కుక్కలకు నీరు పోయడం వంటి పనలకు అతన్ని అక్కడ చేర్చారు.  ఒక వైపు ఎండలు  మరో వైపు సరైన తిండి లేకపోవడంతో తాను అక్కడే చనిపోతానని భయపడ్డాడేమో కనీ వెంటనే  కష్టాలను వీడియో ద్వారా వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్అయింది.                           


శివన్న దీనస్థితి నారా లోకేశ్‌ దృష్టికి చేరింది. వెంటనే లోకేష్ కువైట్‌లోని   తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ అంశాన్ని పరిష్కరించాలని కోరారు.  వెంటనే వారు శివ ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమించి ఇరాక్‌ సరిహద్దులో ఉన్నట్లు కనుగొన్నారు. ఆయనను తీసుకొచ్చి భారతీయ ఎంబసీలో అధికారులకు అప్పగించారు. జరిగిన విషయాన్ని చెప్పి యజమాని వద్ద నుంచి పాస్ పోర్టు ఇప్పించారు. దీంతో శివ స్వదేశానికి చేరుకున్నారు.                         


ఎట్టకేలకు గల్ఫ్  లో ఎడారిలో చిక్కుకుపోయిన  శివన్నకు ఎట్టకేలకు విముక్తి కలిగింది. తన తండ్రి మళ్లీ వస్తాడో రాడోనని తల్లిఢిల్లిపోయిన ఆ కూతురు..  క్షేమ సమాచారం తెలియక ఎంత వేదనకు గురైన ఆయన భార్య.. ఎయిర్ పోర్టులో శివన్నను ప్రత్యక్షంగా చూసి కన్నీరు పెట్టుకున్నారు.