దివంగత నేత ఎన్టీఆర్ కుమార్తె, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై, కుటుంబ సభ్యులో ఏపీ అసెంబ్లీలో అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై కళ్యాణ్ రామ్, నారా రోహిత్ తీవ్రంగా స్పందించారు. నిన్నటితో మీ వంద తప్పులూ అయిపోయాయంటూ వారి కుటుంబసభ్యుడు, టాలీవుడ్ నటుడు నారా రోహిత్ పేర్కొన్నారు. రాజ‌కీయాల‌కు సంబంధం లేని మహిళ గురించి వ్య‌క్తిగ‌తంగా మాట్లాడ‌టం అనేది ఎంతో బాధాక‌రం అని కళ్యాణ్ రామ్ అన్నారు.


ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండోరోజు ప్రతిపక్షనేత చంద్రబాబుకు జరిగిన అవమానంపై నారా రోహిత్ తీవ్రంగా స్పందించారు. ‘ఉన్నత విలువతలతో ప్రజా సమస్యలతపై అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అసెంబ్లీలో పశువుల కంటే హీనంగా కొందరు నేతలు ప్రవర్తించారంటూ మండిపడ్డారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును, ఆయన సతీమణి భువనేశ్వరిని అసభ్యపదజాలంతో దూషించడం దిగ్భ్రాంతికరం. రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలి. కానీ కుటుంబ సభ్యులను అందులోకి లాగి అసభ్యకరంగా మాట్లాడటం క్షమార్హం కాదు.
Also Read: NTR Reaction : ఆడపడుచులను కించ పరచడం అరాచకమే.. ఏపీ అసెంబ్లీ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందన






రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యపు హక్కును దుర్వినియోగం చేస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడడం సరికాదు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చంద్రబాబు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకోవడం అది మీ భ్రమే అవుతుంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉన్న కారణంగానే మీ మనుగడ సాగింది. ఇప్పటికీ విలువలకు కట్టిబడి ఉండటం వల్లే సంయమనంతో ఉన్నాం. శిశుపాలుడి వంద తప్పులు పూర్తయినట్లే నిన్నటితో మీ వంద తప్పులు నిన్నటితో పూర్తయ్యాయి. ఇక వారి అరాచకాలను ఉపేక్షించేది లేదు. ప్రతి ఒక్క టీడీపీ సైనికుడు దుశ్శాసనుల భరతం పడతారు. స్థాయి లేని వ్యక్తుల మధ్యలో రాజకీయాలు చేయాల్సి రావడం దురదృష్టకరం పెదనాన్న. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మేమంతా మీ వెంటే ఉంటామని’ నారా రోహిత్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Also Read: పవిత్రమైన అసెంబ్లీలో ఎన్టీఆర్ కుమార్తెపై దారుణమైన మాటలా ? ఇక సహించబోమన్న నందమూరి కుటుంబం ! 


కళ్యాణ్ రామ్ రియాక్షన్..
అసెంబ్లీ అనేది ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించి వాటి ప‌రిష్కారం కోసం పాటు ప‌డే దేవాలయం వంటిదని నటుడు కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. అక్క‌డ చాలా మంది మేధావులు, చ‌దువుకున్న‌వారు ఉంటారు. అలాంటి ఓ గొప్ప ప్ర‌దేశంలో రాజ‌కీయాల‌కు సంబంధం లేని వారి గురించి వ్య‌క్తిగ‌తంగా మాట్లాడ‌టం అనేది చాలా బాధాక‌రం. ఇది స‌రైన విధానం కాదు. సాటి వ్య‌క్తిని, ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను గౌర‌వించే మ‌న సంప్ర‌దాయంలో మ‌హిళ‌ల‌ను అసెంబ్లీలో అకార‌ణంగా దూషించే ప‌రిస్థితి ఎదురుకావ‌డం దుర‌దృష్ట‌క‌రం. అందరూ హుందాగా నడుచుకోవాలని మనవి చేసుకుంటున్నాను.






यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः ।
यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः ।।


Where women are worshiped, divinity blossoms there. Wherever they are not worshiped, all actions result in failure.


పూజ్యులు తాత రామారావు మహిళలకు ఇచ్చిన గౌరవాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుందామంటూ సోషల్ మీడియాలో కళ్యాణ్ రామ్ స్పందించారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి