Anantapur YSRCP Peddireddy  :    టీడీపీ అజెండాలోనే భాగంగానే షర్మిల రాజకీయం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. అనంతపురంలో సిద్ధం సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.  రాయలసీమ జిల్లాల సిద్దం సభ ఈ నెల 18 న రాప్తాడులో నిర్వహిస్తున్నామని..  ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయన్నారు.  భారీగా పార్టీ క్యాడర్, నాయకులు ఈ కార్యక్రమం కు హాజరవుతారని ప్రకటించారు.  ఎన్నికలకు ఇది శంఖారావం ..ఇప్పటికే భీమిలి, ఏలూరు లో సభ విజయవంతంగా నిర్వహించామని తెలిపారు.  ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులకి సిఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారని..  ఎమ్మేల్యేలు, సమన్వయకర్తలు, ఎంపిలు ఈ సభ ను విజయవంతం చేయాలని కోరుతున్నానన్నారు. 


తెలంగాణ అసెంబ్లీలో చర్చ వింటే ...


టిడిపి పతనావస్థకు చేరింది... ఇది ప్రారంభం మాత్రమేనని పెద్దిరెడ్డి తెలిపారు.  తెలంగాణ అసెంబ్లీలో చర్చ వింటే ఏపి అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తుందని..  సిఎం వైఎస్ జగన్ పట్టుదలతో రాష్ట్ర అవసరాల మేరకు పని చేస్తున్నారన్నారు.  రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత నీరు నిలబెట్టారో, సిఎం వైఎస్ జగన్ దానికి రెట్టింపు నిలబెట్టారని తెలిపారు.  టిడిపి ఏమి చేసింది అని చెప్పుకునే పరిస్థితిలో కూడా లేదన్నారు.  అందరూ ఏకం అవుతారని మొదటి నుండి చెప్తున్నాం, సిఎం వైఎస్ జగన్ ఎప్పుడూ సింగిల్ గానే వస్తారన్నారు.  టిడిపి నమోదు చేసిన దొంగ ఓట్ల వల్ల గతంలో మేము కొన్ని సీట్లు ఒడిపోయాం... మేము ఎలాంటి ఓటర్ నమోదు లు చేయలేదని తెలిపారు.  అధికారులను బ్లాక్ మెయిల్ చేసే లక్షణం చంద్రబాబుదని ఆరోపించారు. 


భారీగా సిద్ధం సభకు జన సమీకరణ ప్రయత్నాలు                                


ముందు నుండి ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసే ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ కూడా ఇండైరెక్ట్ సపోర్ట్ టీడీపీకే ఇస్తుందన్నారు. బీజేపీలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్నారన్న ఆయన.. ఎంతమంది కలిసినా మాకు ఆశ్చర్యం లేదు.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం సింగిల్ గా వస్తారని స్పష్టం చేశారు.  రాయలసీమలోని అనంతపురం జిల్లా పరిధిలోని రాప్తాడు నియోజకవర్గంలో ఈ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 5 లక్షల మంది ఈ సభకు వస్తారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. రాప్తాడు మండల కేంద్రంలోని ఆటో నగర సమీపంలో రాయలసీమ స్థాయలో సిద్ధం సభను నిర్వహిస్తున్నారు. 


గ్రాండ్ సక్సెస్ చేస్తామన్న మంత్రి పెద్దిరెడ్డి                             


గడిచిన ఎన్నికల్లో మూడు స్థానాలు మినహా రాయలసీమలోని అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేస్తుందని, వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీట్ చేసేందుకు దోహదం చేసేలా ఈ సభను నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత ప్రాంతమైన రాయలసీమలో సభను గ్రాండ్ సక్సెస్ చేయడం ద్వారా.. మిగిలిన ప్రాంతాల్లోని కేడర్ కు మరింత భరోసాను కల్పించేందుకు దోహదం చేస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు.