Minister Nimmala Ramanaidu : ప్రభుత్వ పథకాలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తోందని టీడీపీ ఆరోపించింది. అసత్య ప్రచారం, తప్పుడు రాతలు మానుకోకుంటే ఈసారి జగన్ రెడ్డి పార్టీకి డబుల్ డిజిట్ కూడా రాదని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. విదివిధానాలు రూపొందించకముందే తల్లికి వందనంపై విష ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు.
ప్రతి బిడ్డకూ తల్లికి వందనం వర్తింపు
ప్రతి బిడ్డకు తల్లికి వందనం వర్తింపచేస్తామని నిమ్మల రామానాయుడు ప్రకటించారు. అబద్దాలు, అసత్యాలతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారన్నారు. ప్రజలు నడ్డి విరిచినా వైసీపీ అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని.. అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ఒక్కోక్క పథకం అమలు చేస్తుంటే.. ప్రజల నుండి పెద్దఎత్తున ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక వైసీపీ విష ప్రచారం చేస్తోందన్నారు. . విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెచ్చుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అవుతుందని.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు దానికి అంగీకరించారని వక్రబాష్యాలు చెబుతూ.. అబద్దాలు రాయడం దుర్మార్గం. కేంద్ర మంత్రి ప్రకటనలో వైసీపీ అబద్దప్రచారం విష ప్రచారం అని తేలిపోయిందని గుర్తు చేశారు.
చెప్పిన మాట ప్రకారం పింఛన్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం
రూ. 7000 పింఛన్ ఇస్తామని కూటమి చెబితే.. వైసీపీ నేతలు 7వేల పింఛన్ కాదు ఉన్న పింఛన్ కు ఎసరు పెడతారని తప్పుడు రాతలు రాశారు. ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఇంటింటికి పింఛన్ రాదని నీలిమీడియాలో అబద్ధపు ప్రచారం చేశారు. చంద్రబాబు మాట ఇచ్చినట్లే రూ. 7000 పింఛన్ ను ఇంటింటికి తెచ్చి ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. ఉచిత ఇసుకపై తప్పుడు ప్రచారం మొదలెట్టారు. తప్పుడు రాతలు రాస్తున్నారు. మాట ఇస్తే మాట తప్పి మడమ తిప్పే వ్యక్తి జగన్ రెడ్డి. ఒక్క వెయ్యి పెంచడానికి ఐదు సంవత్సారాలు తీసుకున్నారు.. మేము ఐదురోజుల్లోనే పెంచాం. ఇచ్చిన మాట ప్రకారం బకాయిలతో రూ. 7000 పింఛన్ ఇంటివద్దకే ఇచ్చాం, దివ్యాంగుల పింఛన్ ను అన్న మాట ప్రకారం ఆరు వేలకు పెంచాం. జగన్ రెడ్డి డీఎస్పీ, మెగా డీఎస్పీ అని ఐదేళ్లు దాన్ని పట్టించుకోకుండా నిరుద్యోగులను మోసం చేశారు. మీలా కాకుండా అన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు సంతకాలు పెట్టి 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీతో పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు.
అధికారంలోకి వచ్చిన నెలలోనే కీలక నిర్ణయాలు
అమ్మఒడి పేరుతో 15 వేలు అని ఒక్కరికి కూడా ఇవ్వలేక అందులో కోతలు పెట్టి మోసం చేసిన వైసీపీకి ఆపార్టీ నేతలకు తల్లికి వందనం గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది? మళ్లీ తల్లికి వందనంకు మంగళం అంటూ రాతలు రాస్తున్నారు సిగ్గులేకుండా. వైసీపీ మాదిరిగా మా ప్రభుత్వంలో ఎగ్గొట్టాడాలు ఉండవన్నారు. ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టి, మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ప్రైవేట్ ఆస్తులను కొల్లగొట్టాలనే మీ దుర్మార్గపు ఆలోచనలో భాగంగా వైసీపీ నేతలు తీసుకు వచ్చిన ల్యండ్ టైటిలింగ్ యాక్ట్ ను అన్నమాట ప్రకారం రద్దు చేశాం. దాదాపు రూ. 40 వేల కోట్ల ఇసుకను ఐదేళ్లలో బొక్కారు... మేము ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పాం అన్నమాట ప్రకారం దాన్ని నిలబెట్టుకున్నామని గుర్తు చేశారు. 14 లక్షల కోట్లు అప్పు పెట్టినప్పటికి ఖాజానాను మొత్తం ఊడ్చేసి ఖాళీగా ఉంచినప్పటికి కలెక్టర్ ఆఫీసుల దగ్గర నుండి విలువలైన భూములన్నీ తాకట్టు పెట్టినప్పటికి ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నామని స్పష్టం చేశారు.
తిరస్కారానికి గురైన వైసీపీ నేతలు
నేడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తుంటే మీరు ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మెరుగైన సూచనాలు ఇవ్వాలి కాని ఇలాంటి అసత్య, అబద్దపు ప్రచారాలు కొనసాగిస్తే మీరు చరిత్రలో మీగిలిపోవడం ఖాయమన్నారు. పింఛన్ల పండుగు ఏవిధంగా నిర్వహించామో... ఉచిత ఇసుక ఇచ్చి ప్రజల ఆనందం చూశామో… ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ఆస్తులు కాపాడామో. అన్నా క్యాంటిన్ ఏర్పాటు చేసి పేదల కడుపులు నింపుతామో.. డీఎస్సీ ఇచ్చి నిరుద్యోగులకు భారోసా ఇచ్చామో ఆ మాదిరిగానే అన్న మాట ప్రకారం విదివిధానాలు రూపొందించి తల్లికి వందనం కూడా నిలబెట్టుకుని ప్రజల ఆశీసులు పొందుతామని స్పష్టం చేశారు. మీ మాదిరి మా ప్రభుత్వంలో కొతలు, రద్దులు ఉండవు. . వైసీపీ నేతలు ప్రజల తిరస్కారానికి గురైయ్యారు. జగన్ రెడ్డి ఓడిపోతే చంద్రబాబు బూట్లు తుడుస్తానని ఒక మంత్రి అంటే, జగన్ రెడ్డి ఒడిపోతే మీసం గొరిగించుకుంటానని మరోక మంత్రి అన్నాడు, ఇంకో మంత్రి రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటeనని చెప్పాడు వారు అన్న మాటలు గాలికొదిలేసి మళ్లీ మీడియా ముందుకు వచ్చి అసత్యాలు అబద్దాలు చెబుతున్నారన్నారు.