Manchu Manoj supported the parents and students accusing MBU : తమ కాలేజీపై వచ్చే ఆరోపణల్ని ఎవరైనా ఖండిస్తారు. కానీ మంచు మనోజ్ మాత్రం భిన్నం. ఆరోపణలు చేసే వారికి మద్దతు ప్రకటించారు. శ్రీవిద్యానికేతన్, మోహన్ బాబు యూనివర్శిటీలకు సంబంధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇటీవలి కాలంలో యూనివర్శిటీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని.. ఏఐసీటీఈకి కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా విద్యార్థి సంఘాలు కూడా ఎంబీయూపై ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్ పెట్టాయి. ఈ పరిణామాలు కొద్ది రోజులుగా హైలెట్ అవతున్నాయి.  


వివాదంలో మోహన్ బాబు యూనివర్శిటీ - ఫీజుల కోసం పీల్చిపిప్పిచేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపణలు


ఈ వివాదాలపై మోహన్ బాబు యూనివర్శిటీ యాజమాన్యం ఇంత వరకూ ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. చాన్సలర్ అయిన మోహన్ బాబు.. కానీ ఇతర  ఉన్నత పదవుల్లో ఉన్న వారు కానీ ఏమీ స్పందించలేదు. మంచు విష్ణు ప్రస్తుతం విద్యా సంస్థల  బాధ్యతలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఆయన కూడా స్పందించలేదు. అయితే అనూహ్యంగా మంచు మనోజ్ స్పందించారు. తన తండ్రి ఉన్నత విలువలతో విద్యాసంస్థలను స్థాపించారని.. ఇప్పుడు వాటిపై వస్తున్న ఆరోపణల  విషయంలో.. విద్యార్తులు, వారి తల్లిదండ్రులకు సపోర్టుగా ఉంటానన్నారు. వీరు చేసిన ఫిర్యాదులపై స్కూల్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వినయ్ ను వివరణ అడిగానని ఆయన సమాధానం కోసం చూస్తున్నానని చెప్పారు.                   


అదే సమయంలో కాలేజీపై వస్తున్న ఆరోపణలు.. ఇంకా ఏమైనా ఫిర్యాదులు ఉంటే.. తన కు పంపవచ్చని ఆయన తన  మెయిల్ అడ్రస్ ఇచ్చారు.  mm.mbu0419@gmail.com కు కాలేజీకి సంబంధించిన వివరాలు పంపవచ్చని కోరారు. తన తండ్రి దృష్టికి వ్యక్తిగతంగా ఆ అంశాలను తీసుకుని వెళ్తానన్నారు. 



జత్వానీ కేసులో ఇద్దరు ఔట్‌- నెక్స్ట్‌ ఎవరు? అధికార వర్గాల్లో కలవరం


మంచు మనోజ్ స్పందన.. వివాదాస్పదంగా  లేకపోయినప్పటికీ.. తన తండ్రికి తెలియకుండా ఏదో జరుగుతోందని అనిపించేలా స్పందించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య సత్సంబంధాలు లేవు. వారు గొడవ పడిన ఓ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో విద్యా సంస్థల విషయంలో మనోజ్ ప్రమేయం లేదని.. అంతా  విష్ణుయే చూసుకుంటున్నారని  అందరికీ తెలుసు. ఇప్పుడు విష్ణు నిర్వహణలో ఉన్న విద్యాసంస్థల విషయంలో మనోజ్ జోక్యం చేసుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం కుటుంబ వివాదాల పరంగా కూడా కొత్త మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.