Mohan Babu University Controversy : తిరుపతి సమీపంలో ఉన్న మోహన్ బాబు యూనివర్శిటీ  తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాల నేతలు యూనివర్శిటీ వద్ద ఆందోళనకు దిగారు.  తిరుపతి రూరల్ ,  రంగంపేట లో  శ్రీ విద్యానికేతన్ మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది.  విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ఫీజుల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారని..  విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ అందుతున్నా  హాస్టల్ క్యాంటీన్ , మెస్ చార్జీల .. పేరుతో డైలీ బయట నుంచి వచ్చే స్థానిక విద్యార్థులైన డేస్కాలర్స్ వద్ద ఏడాదికి 20,000 అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. 


ప్రశ్నించే  విద్యార్థులపై బౌన్సర్లతో దాడులు                          
 
ప్రతి ఏడాది మోహన్ మంత్ర కార్యక్రమం నిర్వహణ కోసం ప్రతి విద్యార్థి వద్ద ముక్కు పిండి డబ్బులు వసూళ్ళు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   గతంలో ప్రభుత్వం నుండి ఫీజు రీయంబర్స్మెంట్ అందలేదని ఇదే మోహన్ బాబు రోడ్డెక్కారని గుర్తు చేశారు.  మంచితనానికి మారుపేరు తమ యూనివర్సిటీ అని గొప్పలు చెప్పుకునే మోహన్ బాబు..  ఇప్పుడు దోపిడీపై సమాధానం చెప్పాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.  ప్రశ్నించిన విద్యార్థులపై కాలేజీ లో బౌన్సర్లు చేత దాడి  చేయిస్తున్నారని .. రంగంపేటలో ప్రతి ప్రైవేట్ హాస్టళ్ల వెనుక వెనక మోహన్ బాబు అనుచరులు ,  సన్నిహితులు.. ఉన్నారన్నారు.  బయట   , లోపల విద్యార్థులను అన్ని రకాలుగా దోచేస్తున్నారని మండిపడ్డారు. 


జత్వానీ కేసులో ఇద్దరు ఔట్‌- నెక్స్ట్‌ ఎవరు? అధికార వర్గాల్లో కలవరం


ఏఐసీటీఈకి ఫిర్యాదు చేసిన పేరెంట్స్ కమిటీ                          


విద్యార్థుల తల్లిదండ్రులు కూడా  గత వారం నేరుగా ఏఐసీటీఈకి ఫిర్యాదు చేశారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ ఉన్నప్పటికీ  పెద్ద ఎత్తున ఇతర ఫీజులు వసూలు చేస్తున్నారని బిల్డింగ్ ఫీజులు సహా.. కాలేజీకి వచ్చే విద్యార్థులు క్యాంటీన్ లోనే తినాలన్న నిబంధన పెట్టి భారీ డబ్బులు వసూలు చేస్తున్నారని అంటున్నారు. నేరుగా ఏఐసీటీఈకి కూడా తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో విద్యార్థి సంఘాల నేతలు రంగంలోకి దిగారు. 


Also Read: బెజవాడ రైల్వే స్ఠేషన్‌కు భారీ ఆదాయం - NSG 1 హోదా - అభివృద్ధికి మరింత అవకాశం


యూనివర్శిటీగా మారాక వివాదాల్లో ఎంబీయూ 


రెండేళ్ల కిందటే మోహన్ బాబు యూనివర్శిటీ అధికారికంగా ఏర్పాయింది. అంతకు ముందు  శ్రీవిద్యానికేతన్ పేరుతో స్కూల్స్, కాలేజీలు ఉన్నాయి. యూనివర్శిటీ హోదాకు అవసరం అయిన అనుమతులు రావడంతో ఎంబీయూ ప్రారంభించారు. అయితే అప్పట్నుంచి యూనివర్శిటీని అనే వివాదాలు వెంటాడుతున్నాయి.  ప్రతి ఏడాది మోహన్ బాబు పుట్టిన రోజున.. కాలేజీ వార్షికోత్సవంపేరుతో నిర్వహిస్తారు. దీనికి కూడా విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.