Tillu, Das interviewed Devara: ‘RRR’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. దర్శకుడు కొరటా శివ ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా  తెరకెక్కించారు. రెండు భాగాలుగా రూపొందిన ఈ  సినిమా ఫస్ట్ పార్ట్ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ముమ్మరంగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ట్రైలర్ లాంఛ్ తో నార్త్ నుంచి ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టి, ఇప్పుడు సౌత్ కు చేరుకున్నారు.


‘దేవర’ను స్పెషల్ గా ఇంటర్వ్యూ చేసిన టిల్లు, దాస్


‘దేవర’ ప్రమోషన్ లో భాగంగా యంగ్ హీరోలు టిల్లు బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తో స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ ఇంటర్వ్యూ షూట్ పూర్తయ్యింది. ఇందులో హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ పాల్గొన్నారు. వీరిద్దరిని పలు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారట టిల్లు, దాస్. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఎక్కడా చెప్పని కొన్ని ఆసక్తిక విషయాలు ఈ ఇంటర్వ్యూలో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఇంటర్వ్యూ మొత్తం ఫన్నీ గా కొనసాగిందట. సిద్ధు, టిల్లు కలిసి చాలా సార్లు ఎన్టీఆర్ ను ఇరుకున పెట్టే ప్రశ్నలు అడిగారట. వాళ్లు ఎంత తెలివిగా ప్రశ్నలు అడిగితే, ఎన్టీఆర్ మరింత తెలివిగా సమాధానాలు చెప్పారట. ఈ ఇంటర్వ్యూ ‘దేవర’ సినిమాకు మాంచి బూస్టింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు మేకర్స్ భావిస్తున్నారు. అటు ఆడియెన్స్ కూడా ఈ ఇంటర్వ్యూ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.   






తొలిసారి తెలుగు తెరపై కనిపించబోతున్న జాన్వీ కపూర్


‘దేవర’ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం దర్శకుడు కొరటాల చాలా కష్టపడ్డారు. కేవలం స్క్రిప్ట్ కోసమే సంవత్సరం కేటాయించారు. రెండు భాగాలుగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాతో లొలిసారి తెలుగు తెరపై దర్శనం ఇవ్వబోతోంది అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. ఆమె కారణంగా నార్త్ లోనూ ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. ఈ సినిమాను నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బడ్జెట్ కు ఏమాత్రం వెనుకాడకుండా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. సెప్టెంబర్‌ 27న ‘దేవర’ సినిమా తొలి భాగం ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, వచ్చే ఏడాది రెండో భాగం రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.   



Read Also: అక్కడ 'దేవర' ప్రీమియర్ - హాలీవుడ్‌లో ఆ రికార్డ్‌ కొట్టిన ఫస్ట్ ఇండియన్ సినిమా ఎన్టీఆర్‌దే