Andhra Pradesh News Today - జత్వానీ కేసులో ఇద్దరు ఔట్‌- నెక్స్ట్‌ ఎవరు? అధికార వర్గాల్లో కలవరం
ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ కేసు ఇప్పుడు ఏపీలో రాజకీయ సంచలనంగా మారింది. అటు పోలీస్ డిపార్ట్ మెంట్ లో కూడా ఈ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఇద్దరు అధికారులపై తాజాగా వేటు పడింది. మరో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పోలీసులే ఈ కేసులో కీలక నిందితులుగా మారే అవకాశముంది. కాదంబరి జత్వానీ, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ మధ్య ఉన్న గొడవలో చివరకు పోలీసులు బలైపోతున్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ప్రభుత్వం కన్నా జగన్‌నే ఎక్కువ టార్గెట్ చేస్తున్న షర్మిల - కాంగ్రెస్‌వైపు రాకుండా చేసే ప్రయత్నమేనా ?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు ప్రసంగాల్లో ఆమెదైన శైలి ఉంది. కొన్ని సార్లు ఆమె ప్రసంగాలు మీమర్స్ కు కావాల్సింత పని కల్పిస్తూంటాయి.  పాదయాత్ర అంటే పాదాలపై నడిచే యాత్ర ..  రెయినీ సీజన్ అంటే వర్షాలు పడే సీజన్ అనే  నేరేటివ్స్  వైరల్ అవుతూ ఉంటాయి. కానీ ఆమె ప్రభుత్వంపై కానీ.. వైసీపీపై కానీ.. జగన్ పై కానీ విమర్శలు చేయడంలో  ప్రత్యేకత చూపిస్తారు. ఇటీవలి కాలంలో ఆమె ప్రభుత్వం కన్నా వైసీపీ అధినేత జగన్ నే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


కౌశిక్‌రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశా- వివాదం ఇప్పుడే మొదలైంది- ఏబీపీ దేశంతో అరికెపూడి గాంధీ సంచలన కామెంట్స్
హైదరాబాద్ కేంద్రంగా బిఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య దాడులు, ప్రతిదాడులు, విమర్శలు, ప్రతి విమర్శలకు తాత్కాలికంగా బ్రేక్ వేయగలిగారు పోలీసులు. మొదటి రోజు కౌశిక్ రెడ్డి ఇంటిపై అరికెపూడి గాంధీ దాడి అనుచరులతో దాడి చేయించారంటూ బిఆర్ ఎస్ నేతలు నిరసనలు చేసిన విషయం తెలిసిందే. రెండో రోజు పరిస్దితి అదుపుతప్పకుండా ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేస్తూ ఇంటికే పరిమితం చేశారు పోలీసులు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


రేవంత్ ఓ పనికిమాలిన నాయకుడన్న కేటీఆర్, నాలుక కోస్తామని జగ్గారెడ్డి హెచ్చరిక
కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ వివాదం సద్దుమణిగినట్టే అనుకున్నారు కానీ ఇప్పుడు మరో రూపంలో రాజకీయాలను షేక్ చేస్తోంది. ఉదయం అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన కేటీఆర్ ఉదయం కౌశిక్‌రెడ్డిని పరామర్శించారు. అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చేసిన కామెంట్స్ వివాదంపై పెట్రోల్ పోసినట్టు అయింది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


వైసీపీ ఫైర్ బ్రాండ్లకు మైక్ ఇచ్చిన జగన్- పార్టీలో శ్యామలకు ప్రమోషన్


వైసీపీ అధికార ప్రతినిధుల లిస్ట్ విడుదలైంది. అందులో మాజీ మంత్రి రోజా, యాంకర్ శ్యామల కూడా ఉన్నారు. మహిళా కోటాలో వారిద్దరికీ ప్రయారిటీ ఇచ్చారు జగన్. ఇప్పటికే వారికి ఫైర్ బ్రాండ్లు అనే పేరుంది. గత ఎన్నికల సమయంలో రోజా, శ్యామల.. ఇద్దరూ చంద్రబాబు, పవన్ ని బాగా టార్గెట్ చేశారు. ఇప్పుడు కూడా వారికి అదే పని అప్పజెప్పారు జగన్. అధికార ప్రతినిధులుగా వైసీపీ నలుగురు పేర్లను ప్రకటించింది. భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్, రోజా, శ్యామల ఇందులో ఉన్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి