TTD: తిరుమల తిరుపతి దేవస్థానాలకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది. పేరుకు స్వతంత్ర బోర్డు ఉంటుంది కానీ.. ప్రభుత్వ కనుసన్నల్లోనే ఉంటుంది. టీటీడీ బోర్డుకు రాజకీయనాయకుల్నే  చైర్మన్లుగా నియమిస్తున్నారు. సభ్యలుగా రాజకీయ నేతలు, వ్యాపారులు,  పారిశ్రామిక వేత్తలు ఉంటున్నారు. వీరే టీటీడీని నడిపిస్తారు. ఈవోగా ఐఏఎస్ అధికారి ఉన్నప్పటికీ కీలకమైన నిర్ణయాలు రాజకీయ పరంగానే  సాగుతాయి. ఎందుకంటే ప్రభుత్వం ఆగ్రహిస్తే ఈవో పదవి ఉండదు. అందుకే ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ నేతలు చైర్మన్లుగా. సభ్యులుగా ఉంటారు. ఈవో వారు చెప్పింది చేస్తారు. ఇక్కడే అక్రమాలకు బీజం పడుతోంది. 


గత ఐదేళ్ల కాలంలో అర్హత లేకపోయినా ఈవోగా ధర్మారెడ్డి 


తిరుమల తిరుపతి దేవస్థానం అంటే.. వేల కోట్ల బడ్జెట్ మాత్రమే కాదు.. కోట్లాది మంది హిందువుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత ఉన్న సంస్థ. ఈ సంస్థకు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చైర్మన్ గా వైవీ సబ్బారెడ్డి నాలుగేళ్ల పాటు ఉన్నారు. అలాగే రక్షణ శాఖలో పని చేస్తూ.. డిప్యూటేషన్ మీద ఏపీకి వచ్చిన ధర్మారెడ్డి పూర్తిగా ఐదేళ్ల కాలం అనేక సార్లు తన డిప్యూటేషన్  పొడిగించుకుంటూ తిరుమలలోనే కొనసాగారు చివరికి ఆయనకు ఈవో పోస్టింగ్ ఇచ్చారు. సహజంగానే సీనియర్ ఐఏఎస్‌లకు మాత్రమే ఈవో పోస్టింగ్ ఇస్తారు. అర్హత లేకపోయినా పదవి ఇచ్చారని కొంత మంది కోర్టుల్లోనూ పిటిషన్లు వేశారు. ధర్మారెడ్డి వ్యవహారశైలి... ఆయన టీటీడీలో పాతుకు పోవడంపై అనేక విమర్శలు వచ్చాయ. చివరిలో భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ ను చేశారు. ఆయన పైనా అనేక ఆరోపణలు వచ్చాయి. మొత్తంగా ఐదేళ్ల పాటు టీటీడీ వివాదాల మయంగా మారింది.   


బూందీగా ప్రారంభమైన తిరుపతి లడ్డూ చరిత్ర తెలుసా? మొదట్లో 8 నాణేలకే అమ్మకం!


రివర్స్ టెండర్ల పద్దతితో ఇష్టం వచ్చిన వారికి టెండర్లు ఇచ్చారన్న ఆరోపణలు


శ్రీవారి లడ్డూ ప్రసాదం ఉత్కృష్టమైనది.  భౌగోళిక గుర్తింపు ఉన్న వంటకం. ఆ లడ్డూ పవిత్రత కాపాడటానికి అత్యంత నాణ్యమైన సరుకుల్నే కొనుగోలు చేయాలి. ఇది రోజువారీ అన్న క్యాంటీన్లు లేదా మధ్యాహ్న భోజనానికి సంబంధించిన టెండర్లు కాదు. అతి తక్కువకు ఇస్తామని టెండర్లు వేస్తే.. ఎలా ఇస్తారో ఆలోచించకుండా టెండర్లు ఇవ్వడం అనేది దుర్మార్గమైన విషయం. స్వచ్చమైన ఆవు నెయ్యి రూ. వెయ్యి వరకూ అవతుందని డెయిరీ నిపుణులు చెబుతారు. మరి టీటీడీ పెద్దలకు ఎందుకు తెలియలేదో కానీ.  మూడు వందలకు.. నాలుగు వందలకు ఇస్తామని చెప్పగానే టెండర్లు ఇచ్చేశారు. క్క లీటర్‌కు వంద.. రెండు వందలు నష్టం చేసుకుని వేల లీటర్లు ఏ కంపెనీ మాత్రం సరఫరా చేస్తుంది.  అత్యంత నాసిరకం.. కల్తీ నెయ్యిని సరఫరా చేసి దొరికిపోయారు. ఇది చిన్న విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. 


Also Read: లడ్డూ సహా శ్రీవారికి నివేదించే ప్రసాదాలు ఇవే - శుక్రవారం చాలా ప్రత్యేకం!


రాజకీయ జోక్యం వల్లనే ఈ తరహా టెండర్లు - రివర్స్ టెండర్లు


టీటీడీలో గతంలో పని చేసిన పాలక మండళ్లు.. ఇలా రోజువారీ కొనుగోళ్లు..క్వాలిటీ అంశంలో జోక్యం చేుకోవు. అధికారులే అత్యంత జాగ్రత్తగా ఉంటారు. కానీ గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుని ప్రతి టెండర్ ఎవరికి దక్కాలో డిసైడ్ చేసుకుని ఆ మేరకు టెండర్లు..రివర్స్ టెండర్ల ప్రక్రియ నిర్వహించేవారన్న ఆరోపణలు వచ్చాయి. అందులో భాగంగాేన సామర్థ్యం లేని కంపెనీలు టెండర్లలో పాల్గొని తక్కువ ధరకు సరఫరా చేస్తామని ముందుకు వచ్చినా అంగీకరించారని అంటున్నారు. ఈ కంపెనీలకు టెండర్లు దక్కడం వెనుక కీలక పరిణామాలు ఉన్నాయని.. దర్యాప్తులో అన్నీ బయటకు వస్తాయని అంటున్నారు. 


టీటీడీ లాంటి ఆలయాలను నిర్వహించడం ఆషామాషీ కాదు. స్వార్థ పరుల చేతుల్లో పడితే అనేక సమస్యలు వస్తాయి. దేవుడండే భయం,  భక్తి ఉన్న వారు అయితేనే  సక్రమంగా నిర్వహించగలరని.. అలాంటి అధ్యాత్మక వాదులకే పాలక మండలిలో చోటు కల్పిస్తేనే పరిస్థితులు మెరుగుపడుతాయన్న వాదన వినిపిస్తోంది.