కడప జిల్లా పులివెందుల వేదికగా సాగుతున్న దర్యాప్తు మరో మలుపు తిరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రొద్దుటూరు కోర్టుకు వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి వచ్చారు. ఆయన్ని మరోసారి కేంద్రదర్యాప్తు సంస్థ విచారించింది. 85రోజులుగా సాగుతున్న దర్యాప్తును ఇవాళ కూడా సీబీఐ కొనసాగించింది. దస్తగిరిని చాలా అంశాలపై ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నించారు. ప్రొద్దుటూరు కోర్టులోనే ఆయన్ని క్వశ్చన్ చేశారు.
గతంలో వైఎస్ వివేకానందరెడ్డి వద్ద డ్రైవర్‌గా పని చేసిన ఈ దస్తగిరిని కడప నుంచి ప్రొద్దుటూరు తీసుకెళ్లారు. అక్కడే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి.. రికార్డు నమోదు చేశారు. 164 సెక్షన్ ప్రకారం దస్తగిరి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.
మెజిస్ట్రేట్ ముందు దస్తగిరి ఏం చెప్పాడు. ఎలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చాడన్న సస్పెన్ష్ మొదలైంది. ఇప్పటికే ఆయన ఇలా మెజిస్ట్రేట్ ముందు వాచ్‌మెన్ రంగయ్యను హాజరుపరిచారు. ఆయన స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. ఆయన కొన్ని కీలకమైన పేర్లు చెప్పినట్టు అప్పట్లో ప్రచారంలోకి వచ్చింది. తర్వాత ఆ సంగతి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రంగయ్య ఇచ్చిన సమాచారం మేరకే మరికొందరి పిలిచి విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు మాజీ డ్రైవర్ దస్తగిరి ఏం చెప్పి ఉంటాడు. ఎలాంటి వివరాలు సీబీఐ అధికారులకు ఇచ్చి ఉంటాడు. మెజిస్ట్రేట్ ముందు చెప్పిన స్టేట్‌మెంట్‌లో ఇంకా ఏమైనా వివరాలు చెప్పి ఉంటాడా అన్న ఆసక్తి ఇప్పుడు నెలకొంది.
దస్తగిరి చెప్పిన వివరాలు నమోదు చేసుకున్న కేంద్రదర్యాప్తు సంస్థ నెక్ట్స్ స్టెప్ ఏంటన్న ఉత్కంఠ నెలకొంది. తర్వాత ఇంకెవర్ని విచారణకు పిలుస్తారు. విచారణ లిస్టులో ఉన్న పేర్లంటన్న చర్చ కూడా సాగుతోంది.
మరోవైపు ఈ కేసులో అరెస్టైన సునీల్‌యాదవ్ నోరు విప్పడం లేదని తెలుస్తోంది. అందుకే నార్కో అనాలసిస్ పరీక్షలు చేయించాలని సీబీఐ కోర్టును కోరింది. జమ్మలమడుగు కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ రేపు జరగనుంది.
ALSO READ: అమ్మతోడు నాకేం సంబంధం లేదు.. కనీసం నేను వక్కపొడే వేసుకోను.. ఈడీ ఆఫీసులో బండ్ల గణేశ్
వివేకానంద కేసులో కీలకంగా భావిస్తున్న సునీల్ యాదవ్‌ను గోవాలో సీబీఐ అరెస్టు చేసింది. ఆయన ఇచ్చిన ఇన్ఫ్‌ర్మేషన్‌తో కొందర్ని పిలిచి విచారించింది కూడా అంతకు మించి సునీల్ నుంచి సమాధానాలు రావడం లేదని సీబీఐ భావిస్తోంది, ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం సునీల్ వద్ద ఉన్నట్టు కూడా అనుమానిస్తోంది. అందుకే పూర్తి వివరాలు రాబట్టడానికి నిజాలు నిగ్గలు తేల్చేందుకు నార్కో అనాలసిస్ పరీక్షలే కరెక్టని భావిస్తోంది.
ALSO READ: ప్రభుత్వం రోడ్లను బాగు చేయకపోతే గాంధీగిరి శ్రమదానం.. జనసేన పోరాట ప్రణాళిక ఖరారు..!