పుట్టపర్తి కలెక్టరేట్ ముందు నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం 
శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్ ముందు ఉద్రిక్తత వాతావరణం
పొడరాళ్లపల్లికి పునరావాస పరిహారం కల్పించాలని డిమాండ్
కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగిన జిల్లేడుబండ ముంపు బాదితులు 
కలెక్టర్ బయటకు రావాలని కలెక్టరేట్ ముందు ధర్నాకి దిగిన రైతులు
న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానన్న రైతులు
200 మందికి న్యాయం చేయాలని రోడ్డుపై బైటాయించిన రైతులు
దాదాపు 600 ఇండ్లు మునిగిపోతాయని రైతుల ఆవేదన
రైతులు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ అంతరాయం
బందోబస్తు ఏర్పాటుచేసిన సిఐ బాలసుబ్రమణ్యం రెడ్డి


Sri Sathya Sai District: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తనను తాకిన ఓ రైతును జైల్లో వేస్తానంటూ జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. పునరావాస పరిహారం కల్పించాలని కోరిన పాపానికి రైతులపై కలెక్టర్ అంత ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆ వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని ముదిగుబ్బ మండలంలో జిల్లేడుబండ రిజర్వాయర్ నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రిజ్వాయర్ పూర్తయితే మండలంలోని పొడరాళ్లపల్లి, గోపాలపురం, రామసాగరం గ్రామాలు ముంపునకు గురవుతాయి.


పరిహారం కోసం కలెక్టరేట్‌కు రైతులు..
పొడరాళ్లపల్లి, గోపాలపురం, రామసాగరం గ్రామాలు రైతులు తమకు పరిహారం చెల్లించాలంటూ పుట్టపర్తిలోని కలెక్టరేట్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. కలెక్టర్ బయటకు రావాలని జిల్లేడుబండ ముంపు బాధితులు  కలెక్టరేట్ ముందు ధర్నాకి దిగారు. న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని 200 మంది రైతులు స్పష్టం చేశారు. రైతుల ఆందోళనతో బయటకు వచ్చిన కలెక్టర్ రైతులతో మాట్లాడారు. పొడరాళ్లపల్లికి పునరావాస పరిహారం కల్పించాలని ముంపు గ్రామాల రైతులు కలెక్టర్ బసంత్‌కుమార్ ను కోరారు. తమకు న్యాయం చేయాలని రైతులు చేస్తున్న డిమాండ్ ను పట్టించుకోవాల్సింది పోయి కలెక్టర్ కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించారు.


రైతులకు కలెక్టర్ వార్నింగ్.. అన్నదాతలు షాక్ ! 
మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి, అన్ని పనులు త్వరలోనే చేస్తామంటూ రైతులకు కలెక్టర్ బసంత్ కుమార్ ఏదో సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ రైతు కలెక్టర్ బసంత్‌కుమార్ వద్దకు వెళ్లి చేయి పట్టుకుని, సార్ ఓసారి తమ గ్రామానికి వచ్చి పరిశీలించాలంటూ వేడుకున్నాడు. అప్పటికే రైతుల ఆందోళనతో అసహనంగా ఉన్న కలెక్టర్ రైతు నుంచి చేయి విదిలించుకున్నారు. చేయి వదులు.. లేకపోతే లోపలేయించేస్తాను జాగ్రత్త’ అని హెచ్చరించడంతో అక్కడున్న రైతులు షాకయ్యారు. తమాషా చేయవద్దు, అధికారులు అన్ని తనిఖీ చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కలెక్టర్. 600 ఇండ్లు మునిగిపోతాయని న్యాయం చేయాలని కోరితే జైలులో వేయిస్తానంటూ హెచ్చరించడం ఏంటంటూ రైతులు (Sri Sathya Sai District) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆగ్రహంతో పోలీసులు వెంటనే కలుగజేసుకుని రైతులను వెనక్కి వెళ్లేలా చేశారు.


Also Read: ‘దిల్‌ మాంగే మోర్‌’, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రాగా మార్చేయండి - పవన్ కల్యాణ్ సెటైర్లు 


Also Read: భూదందాల ప్రచారం అబద్దం - సీబీఐ విచారణకు సిద్ధమన్న విజయసాయిరెడ్డి !