New Year 2022 Celebrations In AP: న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేదు.. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి హోటళ్లలో పార్టీలు, సామూహిక పార్టీలకు అనుమతులు లేవు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని కర్నూలు జిల్లా ఎస్పీ

Continues below advertisement

దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకునేందుకు నూతన సంవత్సర వేడుకలపై కొన్ని నియమాలు తీసుకొచ్చారు. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించిందని కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి హోటళ్లలో పార్టీలు, సామూహిక పార్టీలకు అనుమతులు లేవన్నారు. ప్రజలు, యువత పోలీసులకు సహకరించాలన్నారు.

Continues below advertisement

డిసెంబర్ 31వ తేదీ రాత్రి కర్నూలు నగరంలో గస్తీ ముమ్మరంగా ఉంటుందని.. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ తీసేసి అధిక శబ్దాలతో ర్యాష్ డ్రైవింగ్ తో హోరెత్తించటం, బాణాసంచా పేల్చడం వంటి వాటి వలన ప్రశాంతతకు భంగం కలిగి వృద్దులకు, చిన్న పిల్లలకు, రోగులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, ఈవ్ టీసింగ్ కు పాల్పడినా చట్ట రిత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బార్లు, స్టార్ హోటళ్లలో అర్ధరాత్రి వరకు పార్టీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు వెయ్యి దాటిపోయాయి. ఈ క్రమంలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు.
 
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కోవిడ్ ఆంక్షలు తప్పనిసరి అవుతున్నాయి. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సహకరించాలన్నారు. హోటల్స్ లో, బార్లలో రహస్య పార్టీలు నిర్వహించి నూతన సంవత్సర సంబరాలు చేసుకోవడానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు బృందాలు బ్లూ కోల్డ్, రక్షక్, స్పెషల్ పార్టీ పోలీసులు డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం నుంచి నగరంలో గస్తీలు చేపడతారన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటారన్నారు.  

ఏపీలో కరోనా కేసులు..
రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా.. 33,188 నమూనాలు పరీక్షించారు. కొత్తగా.. 130 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా నెల్లూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. కరోనా వైరస్ బారి నుంచి.. 97 మంది పూర్తిగా కోలుకుని బయటపడ్డారు. ప్రస్తుతం 1,081 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 
Also Read: Petrol Price 31 December 2021: నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. అక్కడ మాత్రం భారీగా పెరిగిన రేట్లు.. 
Also Read: Gold Silver Price Today: గుడ్ న్యూస్.. మళ్లీ పతనమైన బంగారం ధర.. రూ.800 తగ్గిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవీ..
Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్‌ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్‌!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola