70 years of Span Rice Gift still looks like New one: పెళ్లికి వచ్చిన బంధువులు స్నేహితులు కొత్త దంపతులకు బహుమతులు (Marriage Gifts) ఇవ్వడం అనేది సర్వసాధారణంగా మారింది. బంధువులతో స్నేహితులదో పెళ్లి రేపు ఉందంటే ఇవాళ వెళ్లి గిఫ్ట్ సెంటర్ లో గిఫ్ట్ లను కొనుగోలు చేస్తుంటాం. కానీ 70 సంవత్సరాల కిందట పెళ్లిళ్లకు గిఫ్ట్ ఇవ్వాలంటే ఆనాడు గిఫ్ట్ సెంటర్స్ లేవు కదా! 70 సంవత్సరాల కిందట జరిగిన ఓ పెళ్లి కి తమ సమీప బంధువులు వడ్ల గింజల తో తయారుచేసిన ప్లేట్ ను పెళ్లి కానుక ఇచ్చారు. వడ్ల ప్లేట్ ఇప్పటికీ చెక్కు చెదరక అలాగే ఉండడం దాని ప్రత్యేకత. 70 సంవత్సరాల వడ్ల ప్లేట్ ఏంటి? అనుకుంటున్నారా అయితే ఈ వివరాలపై ఓ లుక్కేయండి.
తాంబూలాల పళ్లెం..
ఇంటికి వచ్చిన అతిథులకు భోజనం పళ్లెములో తాంబూలాలు ఇవ్వటం మర్యాద, మరియు సాంప్రదాయం అని కూడా చెప్పవచ్చు. తాంబూలాలు ఇవ్వడం కోసం స్టీల్, ప్లాస్టిక్, మరియు సంపన్నులు అయితే వెండి పల్లెలలో తాంబూలాలను అతిథులకు తీస్తుంటారు. వడ్ల గింజలతో తయారుచేసిన తాంబూలాలు పళ్లెం (ప్లేట్) 70 సంవత్సరాల కిందట తయారు చేశారు. కానీ వడ్లతో తయారు చేసిన ప్లేట్ 70 ఏళ్ల కిందట తమ సమీప బంధువులు పెళ్లి కానుకగా ఇచ్చిన వడ్ల ప్లేట్ ఇప్పటికీ చెక్కుచెదరకుండా భద్రంగా భద్రపరచుకున్న ఆ ప్లేట్ కు 7 దశాబ్దాలు అవుతోంది.
బహుమతి చూసి మురిసిపోతున్నన మనవళ్లు..
కర్నూలు జిల్లా మద్దికేర గ్రామానికి చెందిన రామాంజనేయులు తన తల్లిదండ్రుల కేపీ వెంకటరామప్ప దంపతుల వివాహం 1952లో జరిగింది. వివాహానికి వచ్చిన సమీప బంధువులో ఒకరు బహుమతిగా వడ్ల ప్లేట్ ఇచ్చారని కుమారుడు రామాంజనేయులు తెలిపారు. తల్లిదండ్రుల వివాహానికి ఇచ్చిన బహుమతిని కుమారుడు రామాంజనేయులు ఇప్పటికీ ఆ వడ్ల ప్లేట్ వినియోగిస్తూ జాగ్రత్తగా దాన్ని భద్రపరిచాడు. 70 సంవత్సరాల వడ్ల ప్లేట్ ను మనవళ్లు ఇప్పటికీ ఆ ప్లేట్ ను చూసి మా అవ్వాతాతల పెళ్లినాటి బహుమతి చూసి మురిసిపోతున్నారు.
వడ్ల ప్లేట్ ప్రత్యేకత
ఈ వడ్ల ప్లేట్ ప్రత్యేకత ఉంది. వడ్లని ఒక్కొక్కటిగా దగ్గరికి చేర్చి దారంతో అల్లి వడ్ల ప్లేట్(పళ్లెం)గా తయారు చేశారు. వడ్లలను పది సంవత్సరాలు దాచి పడితే వడ్లు కచ్చితంగా చెడిపోతాయి. మరి అలాంటి వడ్లు 70 సంవత్సరాలు దాటినా ఇంకా చెక్కుచెదరకుండా ఉండడం కూడా ఈ వడ్ల ప్లేటు ప్రత్యేకత.
Also Read: AP New Districts: ఏపీలో 26 జిల్లాలపై తుది నోటిఫికేషన్ విడుదల - జిల్లాల సమగ్ర వివరాలు ఇవే
Also Read: New Districts In AP: కొత్త జిల్లాల ఏర్పాటులో మరో ముందడుగు- కలెక్టర్లను నియమించిన ప్రభుత్వం