ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటికే జిల్లాల సరిహద్దులు, రెవెన్యూ డివిజన్లు ఖరారు చేసిన ప్రభుత్వం ఇప్పుడు పరిపాలన అంశాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 


ప్రభుత్వం నియమించిన కలెక్టర్ల జాబితా ఇదే


శ్రీకాకుళం జిల్లాకు ప్రస్తుతం ఉన్న కలెక్టర్‌గా శ్రీకేశ్‌ బాలాజీరావు కొనసాగనున్నారు. 


విజయనగరం జిల్లా కలెక్టర్‌గా సూర్యకుమారి కొనసాగుతారు. 


మన్యం జిల్లా కలెక్టర్‌గా నిశాంత్ కుమార్‌ నియామకం


విశాఖ జిల్లా కలెక్టర్‌గా మల్లికార్జున కొనసాగింపు


అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా సుమిత్‌ కుమార్‌


అనకాపల్లి జిల్లా కలెక్టర్‌గా రవి సుభాష్‌ నియామకం


కాకినాడ జిల్లా కలెక్టర్‌గా కృతికా శుక్లా నియామకం


తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా మాధవీలత నియామకం


కోనసీమ జిల్లా కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా నియామకం


పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి నియామకం


ఏలూరు జిల్లా కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేశ్‌ నియామకం


కృష్ణా జిల్లా కలెక్టర్‌గా రంజిత్‌ బాషా నియామకం


ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.దిల్లీరావు నియామకం


గుంటూరు జిల్లా కలెక్టర్‌గా వేణుగోపాల్‌రెడ్డి నియామకం


పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శివ శంకర్‌ నియామకం


బాపట్ల జిల్లా కలెక్టర్‌గా విజయ నియామకం


ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా దినేశ్‌ కుమార్ నియామకం


ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కొత్త జిల్లాలకు కలెక్టర్, ఎస్పీల వివరాలు ఇలా ఉన్నాయి. 


కాకినాడ జిల్లా కలెక్టర్‌- కృతికా శుక్లా
కాకినాడ ఎస్పీ- ఎం రవీంద్రనాథ్ బాబు


తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ -మాధవీలత
తూర్పుగోదావరి ఎస్పీ -ఐశ్వర్య రస్తోగీ


కోనసీమ జిల్లా కలెక్టర్ -హిమాన్షు శుక్లా
కోనసీమ ఎస్పీ - కేఎస్ఎస్వి సుబ్బారెడ్డి


ఇప్పటికే విధులు నిర్వర్తిస్తున్న జిల్లాల కలెక్టర్లను అలాగే  కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం.
వ్యవసాయశాఖ కమిషనర్‌గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ హరికిరణ్‌ను పంపించింది ప్రభుత్వం.