మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై కనిపించి చాలా కాలమవుతోంది. ఆయన చివరిగా నటించిన 'సైరా' సినిమా వచ్చి మూడేళ్లు దాటేసింది. పాండమిక్ కారణంగా చిరంజీవి నుంచి కొత్త సినిమా రాలేదు. ఆయన నటించిన 'ఆచార్య' సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. ఫైనల్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఏప్రిల్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రామ్ చరణ్ కూడా నటించడం విశేషం.
ఈ సినిమా కంటే ముందుగానే చిరంజీవి ఓ కమర్షియల్ యాడ్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో చిరంజీవి గెటప్, ఆయన డైలాగ్స్ మెప్పించాయి. నిజానికి చిరు యాడ్స్ కి దూరంగా ఉంటున్నారు. చాలా ఏళ్ల తరువాత మళ్లీ యాడ్ లో నటించారు. ఓ కంపెనీ కోసం చిరు ఈ యాడ్ చేశారు. సుకుమార్ దీనికి దర్శకత్వం వహించడం విశేషం.
మెగాస్టార్ తో పాటు సీనియర్ నటి ఖుష్బూ, యాంకర్ అనసూయ ఈ యాడ్‌లో కనిపించారు. ఉగాది సందర్భంగా ఈ యాడ్ ని విడుదల చేశారు. ముప్పై సెకన్ల ఈ యాడ్ లో చిరు తన కామెడీ టైమింగ్ మిస్ కాలేదు. పైగా యంగ్ లుక్‌లో కనిపించారు. దీన్ని ఒక యాడ్ లా కాకుండా.. చిన్న పిట్ట కథలా రూపొందించడం బాగుంది. ఈ యాడ్ పై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి చాలా రోజుల తరువాత చిరంజీవిని ఇలా చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు.
ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన 'గాడ్ ఫాదర్' సినిమాలో నటిస్తున్నారు. అలానే బాబీ దర్శకత్వంలో ఓ సినిమా, మెహర్ రమేష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. వీటితో పాటు వెంకీ కుడుములతో కలిసి మరో సినిమా చేయనున్నారు.