మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సునీల్‌ యాదవ్‌ను నార్కో పరీక్షలకు అనుమతించాలన్న సీబీఐ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. 


నార్కో పరీక్షలు కోరుతూ సీబీఐ అధికారులు జమ్మలమడుగు కోర్టులో పది రోజుల క్రితం పిటిషన్ వేశారు. దీనిపై విచారణ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. బుధవారం ఫైనల్‌గా విచారించి తీర్పు వెలువరించింది కోర్టు. 


ALSO READ: 2024లో కుప్పం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగుపెట్టాలి


విచారణలో భాగంగా ఇవాళ్టి విచారణకు కడప జైలు నుంచి సునీల్ యాదవ్‌ వర్చువల్‌గా మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. నార్కో పరీక్ష నిర్వహించాలంటే కోర్టు అనుమతితోపాటు, నార్కో పరీక్ష చేయించుకుంటే వ్యక్తి సమ్మతికూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో నార్కో పరీక్షలకు అంగీకారమేనా అని సునీల్‌ యాదవ్‌ను మెజిస్ట్ట్రేట్‌ అడగ్గా సమ్మతం కాదని సునీల్ తెలిపారు. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సీబీఐ పిటిషన్ తిరస్కరించింది.


ఇప్పటికే ఈ కేసులో ఇద్దరి వాంగ్మూలాలను మెజిస్ట్రేట్ ముందు నమోదు చేసింది సీబీఐ. వాచ్‌మెన్‌ రంగయ్య, వైఎస్ వివేక మాజీ డ్రైవర్‌ స్టేట్‌మెంట్స్‌ రికార్డు చేశారు. ప్రస్తుతం కడప సెంట్రల్‌ జైల్లో ఉన్న సునీల్ యాదవ్‌ను గోవాలో అరెస్టు చేసి తీసుకొచ్చి విచారించారు. ఆయన ఇచ్చిన సమాచారంతో మరికొందర్ని ప్రశ్నిస్తున్నారు. 


ALSO READ: కృష్ణా బోర్డు భేటీ నుంచి తెలంగాణ వాకౌట్ ! ఇంతకీ వాటాలు తేలాయా..?


గతంలో వైఎస్‌  వివేకానందరెడ్డి వద్ద డ్రైవర్‌గా పని చేసిన ఈ దస్తగిరిని కడప నుంచి ప్రొద్దుటూరు తీసుకెళ్లారు. అక్కడే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి.. రికార్డు నమోదు చేశారు. 164 సెక్షన్ ప్రకారం దస్తగిరి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. 


మెజిస్ట్రేట్ ముందు దస్తగిరి ఏం చెప్పాడు. ఎలాంటి స్టేట్‌మెంట్‌ ఇచ్చాడన్న సస్పెన్ష్ మొదలైంది. ఇప్పటికే ఆయన ఇలా మెజిస్ట్రేట్ ముందు వాచ్‌మెన్ రంగయ్యను హాజరుపరిచారు. ఆయన స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. ఆయన కొన్ని కీలకమైన పేర్లు చెప్పినట్టు అప్పట్లో ప్రచారంలోకి వచ్చింది. తర్వాత ఆ సంగతి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రంగయ్య ఇచ్చిన సమాచారం మేరకే మరికొందరి పిలిచి విచారిస్తున్నట్టు తెలుస్తోంది. 


ఈ నేపథ్యంలో ఇప్పుడు మాజీ డ్రైవర్ దస్తగిరి ఏం చెప్పి ఉంటాడు. ఎలాంటి వివరాలు సీబీఐ అధికారులకు ఇచ్చి ఉంటాడు. మెజిస్ట్రేట్ ముందు చెప్పిన స్టేట్‌మెంట్‌లో ఇంకా ఏమైనా వివరాలు చెప్పి ఉంటాడా అన్న ఆసక్తి ఇప్పుడు నెలకొంది. 


ALSO READ: 'పొలిటికల్ పవర్ స్టార్' అయ్యేందుకు పవన్ కల్యాణ్‌కి ఉన్న అడ్వాంటేజెస్ ఇవే..


ALSO READ:జనంలో ఉంటాడు.. జనంలా ఉంటాడు, ఇదీ పవర్ స్టారంటే!