వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ జెండా ఎగరేయాలని సజ్జల రామకృష్ణా రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ పార్టీ నేత దివంగత చంద్రమౌళి తనయుడు భరత్ అసెంబ్లీలో అడుగుపెట్టాలని అన్నారు. చంద్రబాబుకు సర్పంచ్ ఎన్నికల నుంచే కుప్పంలో కౌంట్ డౌన్ ప్రారంభమైందని సజ్జల పేర్కొన్నారు. కుప్పంలో టీడీపీ కోటను బద్ధలు కొట్టుకుని.. ప్రజల హృదయాల్లోకి జగన్ ఎలా వేళ్లారనడానికి.. సర్పంచ్ ఎన్నికలే ఉదాహరణ అని చెప్పారు. తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వన్య కుల క్షత్రియ కమ్యూనిటీ రాష్ట్ర స్థాయి సమావేశమైంది. సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Araku Road : మారేడుమిల్లి టూ అరకు డీప్ ఫారెస్ట్ రోడ్ ట్రిప్ ట్రై చేస్తారా..? రోడ్డెక్కడ ఉందని అనుకోకండి.. ఇది తెలిస్తే రెడీ అయిపోతారు..!
వెనకబడిన బీసీ కులాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బీసీ కులాలకు సంబంధించి ఫెడరేషన్లను ఏర్పాటు చేశారన్నారు. వైయస్ జగన్ మరో అడుగు ముందుకు వేసి బీసీ అధ్యయన కమిటీని నియమించి.. బీసీల్లో వెనకబడిన కులాలను గుర్తించారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారన్నారు.
CM Jagan Review: ఎప్పుడూ వరి సాగేనా.. అవి సాగుచేసినా రైతులకు ఆదాయం బాగానే వస్తుంది
రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు రాకూడదని.. కేంద్రం నుంచి నిధులు రాకూడదని దుష్టపన్నాగాలు పన్నుతున్నారని సజ్జల అన్నారు. ఆర్థిక సంక్షోభం.. అని దుష్ప్రచారం సాగిస్తున్నారని విమర్శించారు. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన భాద్యత అందరిపై ఉందన్నారు. కుప్పం నియోజకవర్గంలో ధర్మరాజు దేవాలయాన్ని అభివృద్ధి చేసే విషయంలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణతో కలసి ముఖ్యమంత్రి జగన్ ని కలుస్తామని సజ్జల తెలిపారు.
బీసీ కులాల అభ్యున్నతే లక్ష్యంగా కొద్దిరోజులుగా బీసీ కులాల ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని పలువురు నేతలు తెలియచేశారు. ఆయా కులాల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.