కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు విశేష స్పందన వస్తోందన్నారు కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్. ఈ యాత్రలో కీలకంగా పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల వారిని కలుపుకొని దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి యాత్రే జోడోయాత్ర అని చెప్పారు. 2024 లో కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తమకు అధికారం వచ్చాక ఏపీకి న్యాయం చేస్తామని ప్రజల ఆశీర్వాదం కావాలన్నారు.


కర్నూలు జిల్లాలో రాహుల్ పాదయాత్ర 
కర్నూలు జిల్లాలో నాలుగు నియోజకవర్గాలలో నాలుగు రోజులపాటు యాత్ర అనంతరం మంత్రాలయం సమీపంలో కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ఆంధ్ర ప్రజలకు తాము అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్‌కు చేయబోయే పని ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని మరోసారి కుండ బద్దలు పగలగొట్టేలా చెప్పేశారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రహంతో ఉన్న ప్రజల ముందుకు మీడియా సమక్షంలో రేపు జరగబోయే ఆదోని ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన చట్టాలు, విభజన హామీలు.. విభజించినటువంటి తీరు లాంటి కీలక అంశాలపై వ్యాఖ్యానిస్తామని చెప్పారు జయరాం రమేష్. 


దేశ వ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జరుగుతున్న ఈ జోడో యాత్ర అన్ని వర్గాల వారికి చేరువ అవుతుందన్నారు. దేశవ్యాప్తంగా జరిగే యాత్ర కంటే భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ యాత్ర ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా 60 సంవత్సరాల రాజకీయ చరిత్రలో దళితులకు అధ్యక్ష పదవిని కేటాయించామని గుర్తుచేశారు.


మూడు కీలకాంశాల మీదనే భారత్ జోడో యాత్ర 
భారత్ జూడో యాత్ర కీలకంగా మూడు అంశాలపైనే కొనసాగుతుందని.. దేశంలో ధరలు నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం వంటి వాటిపై ప్రజలు ఆలోచింపచేసేలా చేసేటటువంటి యాత్ర జూడో యాత్ర అన్నారు. దేశంలో కులం, మతం, రంగు వర్గ భేదాలు కాకుండా సమానత్వం కోసం కృషి చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ అని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు.


ఏపీలో నాలుగు రోజులపాటు రాహుల్ పాదయాత్ర..
నాలుగు రోజులు పాటు ఏపీలో రాహుల్ పాదయాత్ర సాగనుంది. నేటి ఉదయం 6.30 నిమిషాలకు ఆలూరు చత్రగుడి హనుమాన్ టెంపుల్ నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభం అయింది. మంగళవారం ఉదయం 10.30 ఆలూరు సిటీ లోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. రాత్రికి చాగి గ్రామంలో నైట్ హాల్ట్ ఉంటుంది. బుధవారం (19వ తేదీ) ఉదయం 6.30 నిమిషాలకు తిరిగి చాగి నుంచి రాహుల్ యాత్ర ప్రారంభం కానుంది. ఎల్లుండి ఉదయం 10.30 నిమిషాలకు ఆదోని ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీకి యాత్ర చేరుకుంటుంది. రాత్రి 7 గంటలకు ఆదోనిలోని ఆరేకల్ లోని జెల్లి నాగన్నా తాతా దర్గా నుంచి యాత్ర సాగనుంది. ఎమ్మిగనూరు చెన్నాపురం క్రాస్ వద్ద రాహుల్ రాత్రి బస చేయనున్నారు.  
20వ తేదీ ఉదయం 6.30 నిమిషాలకు పాదయాత్ర ఎమ్మిగనూరు నుంచి ప్రారంభం కానుంది. గురువారం 11 గంటలకు యెమ్మిగనూరు ధర్మాపురం గ్రామానికి రాహుల్ యాత్ర చేరుకుంటుంది. సాయంత్రం నాలుగు గంటలకు ధర్మాపురం టోల్ గేట్ వద్దకు, రాత్రి ఏడు గంటలకు కల్లుదేవర కుంటకు పాదయాత్ర చేరుకుంటుంది. మంత్రాలయం అవుట్ కర్ట్స్ లో రాత్రి రాహుల్ బస చేయనున్నారు.  21వ తేదీ ఉదయం 6.30 నిమిషాలకు మంత్రాలయం టెంపుల్ సర్కిల్ నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 10.30 నిమిషాలకు కర్ణాటకలోని రాయచూర్ లోకి రాహుల్ యాత్ర కొనసాగనుంది.