Viral News: నేనే పెద్ద కూలీని - కార్మికులతో కలిసి రిక్షా తొక్కిన మంత్రి రామానాయుడు

పెద్ద కూలీని నేనే- కార్మికులతో కలిసి రిక్షా తొక్కిన మంత్రి రామానాయుడు
పశ్చిమగోదావరిజిల్లా పాలకల్లులో ఏపీ జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కార్మికులతో కలిసి రిక్షా తొక్కారు.
మండుటెండలో వందల మంది రిక్షా కార్మికులతో కలిసి నాలుగు కిలోమీటర్లు ఎలాంటి అలసట లేకుండా రిక్షా తొక్కారు.
స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ నుంచి పెద్ద గోపురం సెంటర్, పాత పోలీస్ స్టేషన్ సెంటర్, కారుమూరు వారి వీధి, ఎన్టీఆర్ కళాక్షేత్రం, ఆర్టీసీ బస్టాండ్ రోడ్, లాకు దిగువ, రైల్వే గేట్ సెంటర్ మీదుగా మంత్రి కార్యాలయం వరకు సాగింది.
ర్యాలీలో పాల్గొన్న కార్మికులందరికీ టీ షర్టులు, రెండు టవల్స్ ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి రామానాయుడు అందజేశారు.
మంత్రి రామానాయుడు మాట్లాడుతూ పాలకొల్లు పెద్దకూలి నేనే అన్నారు. గత 15 సంవత్సరాలుగా మేడే రోజున కార్మికులతో కలిసి వేడుకల్లో పాల్గొనడం సంతృప్తి ఆనందాన్ని ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్మికులు కర్షకులకు అండగా అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
పట్టణంలో పలు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లోనూ మంత్రి రామానాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు, జనసేన లీడర్లు పాల్గొన్నారు.