Banks serves Notice to Farmers in Anantapur district: జై జవాన్.. జై కిసాన్ - భారత రెండవ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన నినాదం. ’జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్’ మరో ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయ్ ఈ నినాదాన్ని ఇచ్చారు. అంటే మన దేశంలో రైతులకు ఇవ్వాల్సిన గౌరవం, వారికి ఉన్న ముఖ్యపాత్రను ఆ నినాదాలు సూచిస్తున్నాయి. దేశాన్ని కాపాడే కి సైనికుడు ఎంత ముఖ్యమో అన్నం పెట్టే రైతన్న కూడా అంతే అవసరం. అన్నం పెట్టే అన్నదాతకు ఎన్నోచోట్ల అవమానాలే ఎదురవుతూ ఉంటాయి. పంట వెయ్యాలన్న అప్పు, పంట కోయాలన్న అప్పు పట్టుకపోతే వారి పరిస్థితి వర్ణణాతీతం. అన్నం పెట్టే రైతన్నను బ్యాంకులు కోర్టు మెట్లెక్కిస్తున్నాయి. లక్షల కోట్ల రుణాలు తీసుకొని బ్యాంకుకు పంగనామాలు పెట్టి విదేశాలకు వెళ్లిపోయిన ఏమీ అనరు గానీ, మనకు అన్నం పెడుతున్న అన్నదాతల్ని మాత్రం ఆదుకోవడం లేదని తరచూ వినిపించే మాట. తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించలేదని, వాయిదాలు కట్టడం లేదని రైతుల్ని బ్యాంకులు కోర్టులకు ఈడుస్తున్నాయి.
నేడు జాతీయ లోక్ అదాలత్
నేషనల్ లోకదాలత్ కావడంతో అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున బ్యాంకర్లు రైతులకు నోటీసులు పంపారు. మీరు తీసుకున్న రుణము (Farmer Loans) వన్ టైం సెటిల్మెంట్ కింద లోకదాలత్ లో బ్యాంకు అధికారులకు కట్టి మీ యొక్క అప్పును మాఫీ చేసుకోవాలంటూ బ్యాంకు అధికారులు రైతులకు నోటీసులు జారీ చేశారు. వేలకోట్ల రూపాయలను బ్యాంకులో నుంచి అప్పుగా తీసుకొని దేశం విడిచి విదేశాలకు పరారయ్యే ప్రముఖులను పట్టించుకోని ఈ సంస్థలు.. కొందరు పారిశ్రామికవేత్తలకు నష్టం వచ్చిందని రుణమాఫీ చేస్తున్నారు. కానీ అన్నదాతను ముప్పు తిప్పలు పెడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రైతు పంట వేసుకోవడానికి అప్పు తీసుకున్న రైతులకు బ్యాంకు అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఆ నోటీసులు తీసుకొని అనంతపురం జిల్లా కోర్టులని న్యాయ సేవా సదా దగ్గరకు వచ్చారు. వచ్చినవారు తమ అప్పును కొంత మేర మాఫీ చేసి కట్టుకునే వారు కొందరైతే.. సరైన పంటలు లేక పంటలు పండిన గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయామని కొందరు రైతులు ఆ అధికారుల ముందు వారి గోడును వెల్లబోసుకున్నారు.
కరువు జిల్లా అనంతపురంలో రైతుల దుస్థితి :
దేశంలోనే అనంతపురం జిల్లా అత్యంత తక్కువ వర్షపాతం పడే ప్రాంతాల్లో ఒకటని తెలిసిందే. ఇక్కడ అత్యధికంగా రైతులు ఉమ్మడి జిల్లాలో 22 లక్షల హెక్టార్లు పంటలు సాగు చేస్తారు. జిల్లా రైతాంగానికి వేరుశనగ ప్రధాన వాణిజ్య పంట. ప్రతి సంవత్సరం అతివృష్టి అనావృష్టి కారణంగా రైతులు పంటను కోల్పోతూ వస్తున్నారు. దీంతో వ్యవసాయాన్ని వదిలిపెట్టి వివిధ రాష్ట్రాలకు ఉపాధి కూలీలుగా పొట్ట చేత పట్టుకొని వలస వెళ్లిపోతున్నారు. ఫలితంగా వేలాది ఎకరాలు బీడు భూములుగా మారిపోతున్నాయి జింకలు ఇతర వన్యప్రాణాలకు ఆవాస్య కేంద్రాలుగా మారాయి.
వ్యవసాయం మీద విపరీతమైన ప్రేమను పెంచుకుని రైతులు భూమిని వదులుకోలేక పంటలు సాగు చేస్తూ, దిగుబడి రాకపోవడంతో పెట్టుబడుల రూపంలో తీవ్రంగా నష్టపోతున్నారు బ్యాంకుల్లో భూములను తాకట్టుపెట్టి మరి సాగు కోసం రుణాల పొందారు. కానీ సకాలంలో వర్షాలు లేకపోవడం, వేసిన విత్తనాలు సరిగ్గా మొలకెత్తకపోవడమే, లేక చీడపీడల వల్ల పంట నష్టపోవడమే జరుగుతోంది. ప్రతి ఏడాది నష్టాలు చదివి చూస్తుండడంతో బ్యాంకుల్లో తెచ్చిన అప్పు చెల్లించలేదు. అప్పు పెరిగిపోయి రైతుల్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. నేల తల్లి మీద అన్నదాతలకు బ్యాంకర్లు నోటీసుల మీద నోటీసులు ఇచ్చారు. ఇలా ఆఖరికి కోర్టు మెట్లు ఎక్కే విధంగా చేశాయని రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని కోరుతున్నారు.