Payyavula Keshav attends GST Council Meeting | అనంతపురం: రాజస్థాన్‌లోని జైసల్మేర్ లో జరిగిన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. జీఎస్టీ విధానంలో తేవాల్సిన మార్పు చేర్పులపై జీఎస్టీ కౌన్సిల్లో కీలక సూచనలు చేశారు మంత్రి పయ్యావుల. ఏపీ రాష్ట్రానికి ఏం కావాలో ప్రజెంట్ చేస్తూనే.. వివిధ రంగాల్లో జీఎస్టీ కౌన్సిల్ అనుసరించాల్సిన విధానాలను సమావేశంలో వివరించారు. 5 శాతానికి మించి జీఎస్టీ శ్లాబులో ఉన్న వస్తువులపై రాష్ట్రంలో జరిగే రవాణాపై ఒక్క శాతం ఏపీ ఫ్లడ్ సెస్ విధించాలని కోరారు. దీని వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉండదు.

Continues below advertisement


గతంలో కేరళలో ఇదే తరహాలో సెస్ విధింపు


ఈ సెస్ ద్వారా ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహయ, పునరావాస చర్యలు చేపడతాం అన్నారు. 2018లో కేరళ వరదల సమయంలో ఇదే తరహా సెస్ విధించారని తెలిపారు. ఇన్నోవేషన్లకు ప్రొత్సహమిచ్చేలా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు నిర్వహించే రీసెర్చ్ సర్వీసెస్ కు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలి. పేదలకు రేషన్ ద్వారా ఇచ్చే పోర్టిఫైడ్ బియ్యంపై జీఎస్టీ సుంకాన్ని తగ్గించాలన్నారు. ఐజీఎస్టీ సెటిల్మెంట్ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేపట్టాలి.. రాష్ట్రాలకూ డేటా అందుబాటులో ఉండేలా చూడాలేని సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు.


నిర్మలా సీతారామన్‌కు పయ్యావుల ధన్యవాదాలు


చిన్న వ్యాపారస్తులు.. కాంపోజిషన్ జీఎస్టీ చెల్లింపుదారులకు అద్దెల విషయంలో విధించే రివర్స్ ఛార్జ్ మెకానిజం-RCM నుంచి మినహాయింపు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో భాగంగా జీఎస్టీ రిజిస్ట్రేషన్లను మరింత సులభతరం చేసేందుకు టెక్నాలజీని వినియోగించుకోవాలి.. అలాగే బోగస్ రిజిస్ట్రేషన్లను అరికట్టాలని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. పయ్యావుల కేశవ్ సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సూచనలను పరిశీలించేందుకు మంత్రి వర్గ ఉప సంఘం వేసిన జీఎస్టీ కౌన్సిల్. తాను చేసిన సూచనలపై మంత్రి వర్గ ఉప సంఘం వేసినందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు మంత్రి పయ్యావుల కేశవ్.


Also Read: Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్