అనంతపురం జిల్లాలోకి దొంగలు వచ్చారు... జాగ్రత్తగా ఉండండి. ఇది అనంతపురం పోలీసుల అనౌన్స్మెంట్. దొంగతనం జరిగిన తరువాత బాధపడే కంటే.. ముందే జాగ్రత్తపడటం మంచిదంటున్నారు అనంతపురం పోలీసులు. ఇప్పటికే కదిరిలో మహిళను హత్య చేసి దొంగతనం చేసిన కేసులో నిందితులు దొరకలేదు. బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నప్పటికీ క్లూ దొరకడం లేదు. ఎవరు చేశారన్నది కూడా తేల్చలేకపోతున్నారు పోలీసులు. దీనికి కొత్త ముఠాలు జిల్లాలోకి వచ్చాయన్న సమాచారంతో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. రాత్రింబవళ్లు గస్తీ కాస్తున్నారు. ఎవరైనా కొత్తగా కన్పిస్తే వారిని వెంటనే అదుపులోకి తీసుకొంటున్నారు. వారి వేలిముద్రలు తీసుకొని చెక్ చేస్తున్నారు. వీధుల్లోకి కొత్తవారు కానీ, వెంట్రుకలు, పాత సామానులు అంటూ వచ్చేవారిపై అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటున్నారు. పోలీసులు వచ్చే వరకు వాళ్లను అక్కడే ఉంచాలని సూచిస్తున్నారు. ఇప్పటికే శివారు ప్రాంతాలు, గేటెడ్ కమ్యూనిటీల‌్లో సమావేశం పెట్టి సిసి కెమెరాలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాటిని గమనిస్తూ పోలీసులుకు సహకరించాలని సూచిస్తున్నారు.


కొత్త గ్యాంగ్‌లు వచ్చాయన్న సమాచారం పోలీసు వర్గాల్లో కలవరానికి గురి చేస్తుంది. వేసవి కాలంలో ఎక్కువగా దొంగతనాలు జరిగేవి. అప్పుడు అంతా ఆరుబయట పడుకుంటారు కాబట్టి దొంగలకు చోరీలు చేయడం చాలా ఈజీగా ఉండేది. రానున్నరోజుల్లో కరోనా ఎక్కువగా ఉంటుందని అంచనాలతో దొంగలు ముందుగానే వచ్చారని అంటున్నారు పోలీసులు. మహారాష్ట్ర నుంచి వచ్చే పార్థీ గ్యాంగ్, తమిళనాడు నుంచి వచ్చే ఊజికుప్పంగ గ్యాంగ్లు ముందుగానే వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరికి తోడు ఇఫ్పటికే రాష్ట్రంలో చెడ్డీగ్యాంగ్ హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర గ్యాంగ్ లు రైళ్లలో దోపిడీకి తెగబడేవి. కానీ ప్రస్తుతం రైళ్లు పెద్ద ఎత్తున తిరగడం లేదు. రానున్నరోజుల్లో కోవిడ్ పెరిగితే రైళ్లు నిలిచిపోయే అవకాశం ఉందని అందుకే ఊళ్లపై పడుతున్నాయి ఈ గ్యాంగ్‌లు. ఇప్పటికే కదిరిలో ఒక దొంగల ముఠా ఒకరిని హత్యచేసి దోచుకెల్లిన సంఘటన కలకలం రేపింది. వీటికి తోడు చెడ్డీగ్యాంగ్ చేస్తున్న దొంగతనాలు కూడా పోలీసులను కలవరపెడుతున్నాయి. దీంతో అనంతపురం పోలీసులు హైఅలర్ట్ ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ శివారు ప్రాంతాలు,పెద్ద ఇళ్లు ఉన్నవారు కచ్చితంగా సిసి కెమెరాలు పెట్టుకోవాల్సిందే అంటూ నోటీసులు ఇస్తున్నారు.


కొత్త ముఠాలు వచ్చాయన్న పక్కా సమాచారంతో రాత్రివేళ గస్తీతోపాటు, కొత్త వ్యక్తులకు ఇళ్ళు అద్దెకు ఇచ్చే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు పోలీసులు. కదిరి హత్య కేసు కొలిక్కి రాకపోవడంతో పోలీసుల్లో అసహనం పెరిగిపోతోంది. అనుమానితులను  విచారిస్తున్నప్పటికీ వారి నుంచి సరైన సమాచరాం రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు పోలీసులు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. త్వరలోనే కదిరి కేసును తేల్చాలన్న పట్టుదలతో ఉన్నారు పోలీసులు. పట్టణ శివారు గ్రామాల్లో పోలీసులు దండోరా కూడా వేయిస్తున్నారు. దీంతో అందరూ అప్రమత్తంగా ఉండండి.....అనుమానితులు...సమస్యగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి అంటున్నారు అనంతపురం పోలీసులు.


Also Read : నూతన సచివాలయ పనులను పరిశీలించిన కేసీఆర్.. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం


Also Read: Telangana New Secretariat : వచ్చే దసరాకు పాలనలో కొత్త వెలుగులు... రెడీ అవుతున్న తెలంగాణ కొత్త సెక్రటేరియట్ !


lso Read: సాయితేజ కుటుంబానికి రూ.కోటి సాయం, ఉద్యోగం ఇవ్వండి.. ఏపీ ప్రభుత్వానికి చంద్రబాబు విజ్ఞప్తి !


Also Read: ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళన ఇప్పుడల్లా లేనట్లే ! కొత్త మంత్రుల జాబితా రెడీ చేసుకున్నా వెనక్కి తగ్గిన సీఎం జగన్ !?


Also Read: పరువు కోసం బావ హత్య.. కాబోయే బామ్మర్దులు కత్తులతో ఘాతుకం


Also Read: Revanth Reddy: పార్లమెంటులో వాళ్లదంతా ఉత్తుత్తి పోరాటం.. టీఆర్ఎస్, బీజేపీది కుమ్మక్కు రాజకీయం


Also Read:  ఈ పిల్లలు జీవితాంతం బస్సుల్లో ఫ్రీగా తిరగొచ్చు.. ఎండీ సజ్జనార్ గ్రేట్ ఆఫర్, ఎందుకంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి